ఓవర్సీస్ లో 'పెద్ది' సంచలనం.. ఫస్ట్ మూవీగా రికార్డ్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం పెద్ది విడుదలకు ముందే ఓవర్సీస్ మార్కెట్ లో సంచలనం సృష్టిస్తోంది.
By: M Prashanth | 8 May 2026 11:50 AM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం పెద్ది విడుదలకు ముందే ఓవర్సీస్ మార్కెట్ లో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా అమెరికా ప్రీమియర్ బుకింగ్స్ లో ఆ సినిమా చూపిస్తున్న జోరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విడుదలకు ఇంకా కొన్ని వారాలు ఉండగానే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా, అతి తక్కువ సమయంలో భారీ స్థాయిలో టికెట్లు అమ్ముడవడం విశేషం.
అమెరికాలో జూన్ 3న గ్రాండ్ ప్రీమియర్స్ కు ప్లాన్ చేసిన ఆ చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 30 నిమిషాల్లో 50 వేల డాలర్లకు పైగా ప్రీ సేల్స్ నమోదయ్యాయి. నాలుగు గంటలు పూర్తయ్యేలోపే లక్ష డాలర్ల మార్క్ ను అందుకోవడం విశేషం. అత్యంత వేగంగా లక్ష టికెట్స్ సేల్ అయిన చిత్రంగా కూడా రికార్డు క్రియేట్ చేసింది పెద్ది చిత్రం.
అయితే టాలీవుడ్ లో ఇటీవల విడుదలైన పలు భారీ చిత్రాల రికార్డులను బ్రేక్ చేస్తూ ఆ ఫీట్లు సాధించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఓజీ, తారక్ దేవర, ప్రభాస్ సలార్ వంటి సినిమాల ప్రారంభ బుకింగ్స్ రికార్డులు పెద్ది బ్రేక్ చేసింది. ఓవర్సీస్ లో ఆ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు కూడా స్పెషల్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక నార్త్ అమెరికాలో 950కి పైగా షోలతో విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే అనేక ప్రాంతాల్లో సీట్లు స్పీడ్ గా ఫుల్ అవుతుండటంతో సినిమాపై అభిమానుల్లో ఆసక్తి ఏ రేంజ్ లో ఉందో క్లియర్ గా అర్థమవుతోంది. ముఖ్యంగా అమెరికాలో తెలుగు ప్రేక్షకులు చరణ్ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.
ఇటీవల విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాకు మంచి బజ్ తీసుకొచ్చింది. ముఖ్యంగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. చరణ్ లుక్, మాస్ బాడీ లాంగ్వేజ్, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కనిపించిన యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్రంలో ఎమోషన్స్ స్ట్రాంగ్ గా ఉండబోతున్నాయని, కొంతమంది రంగస్థలం తరహా ఎమోషనల్ కనెక్ట్ కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు.
పెద్ది చిత్రాన్ని స్పోర్ట్స్, యాక్షన్, ఎమోషన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు బుచ్చిబాబు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన తెరకెక్కించిన ఉప్పెనలో ఎమోషన్స్ కు స్పెషల్ ఇంపార్టెన్స్ ఉండటంతో పెద్ది సినిమాపై కూడా అదే రేంజ్ లో అంచనాలు పెరిగాయి. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ ప్రొడక్షన్ వాల్యూస్ తో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
ఇక త్వరలో థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గ్లింప్స్ తో భారీ హైప్ తెచ్చుకున్న చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కూడా అంచనాలకు మించి ఉంటే, విడుదల సమయానికి ఓవర్సీస్ మార్కెట్ లో అడ్వాన్స్ బుకింగ్ లో భారీ వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉందని అంతా అభిప్రాయపడుతున్నారు. మరేం జరుగుతుందో అంతా వేచి చూడాలి.
