Begin typing your search above and press return to search.

బుచ్చిబాబు కూతురు.. ఉపాసన అంత ప్రేమ చూపిస్తున్నారా?

జూన్ 4వ తేదీన పెద్ది సినిమా రిలీజ్ కానుండగా.. ప్రమోషన్స్‌లో భాగంగా బుచ్చిబాబు మాట్లాడుతూ ఉపాసనతో తమ కుటుంబానికి మంచి బాండింగ్ ఏర్పడిందని చెప్పారు.

By:  M Prashanth   |   17 May 2026 9:00 PM IST
బుచ్చిబాబు కూతురు.. ఉపాసన అంత ప్రేమ చూపిస్తున్నారా?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా తెరకెక్కించిన పెద్ది సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. ప్రమోషన్స్ లో భాగంగా బయటపడుతున్న ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ సినిమా ద్వారా బుచ్చిబాబు, చరణ్ కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఏర్పడిందనే వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఉపాసన కొణిదెల.. తన కుమార్తెపై చూపిస్తున్న ప్రేమకు సంబంధించి బుచ్చిబాబు చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

జూన్ 4వ తేదీన పెద్ది సినిమా రిలీజ్ కానుండగా.. ప్రమోషన్స్‌లో భాగంగా బుచ్చిబాబు మాట్లాడుతూ ఉపాసనతో తమ కుటుంబానికి మంచి బాండింగ్ ఏర్పడిందని చెప్పారు. "ఉపాసన గారు రోజూ కాల్ చేస్తుంటారు. మా కూతురితో మాట్లాడుతుంటారు. వాళ్ల ఇంటికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తుంటారు. ఎప్పుడు తిరిగి పంపుతారో కూడా తెలియదు. వాళ్ళ పాప క్లీంకారతో కలిసి రోజంతా ఆడిస్తుంటారు" అంటూ ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి.

అయితే చిన్నారుల మధ్య ఏర్పడిన ఆ స్నేహం రెండు కుటుంబాలను మరింత దగ్గర చేసిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా క్లీంకారతో కలిసి బుచ్చిబాబు కుమార్తె ఆడుకుంటున్న విషయాన్ని దర్శకుడు ఎంతో ఎమోషనల్‌ గా పంచుకున్నారు. దీంతో ఉపాసన పిల్లల పట్ల చూపించే ఆప్యాయత, ప్రేమ గురించి అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫ్యామిలీ రిలేషన్స్ ను ఎంతో విలువైనవిగా భావించే కొణిదెల కుటుంబం మరోసారి వార్తల్లో నిలిచింది.

పెద్ది సినిమా పనుల్లో బిజీగా ఉన్న సమయంలో కూడా రామ్ చరణ్, ఉపాసన దర్శకుడు బుచ్చిబాబును ప్రత్యేకంగా ప్రోత్సహించినట్లు తెలుస్తోంది. సినిమా కోసం ఆయన పడుతున్న కష్టాన్ని గుర్తించి ఓ ప్రత్యేక గిఫ్ట్ పంపి సర్ప్రైజ్ చేసిన విషయం అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దర్శకుడిపై వారికి ఉన్న గౌరవం, అభిమానం ఆ కానుక వెనుక కారణమని అంతా అభిప్రాయపడ్డారు.

ఇటీవల రామ్ చరణ్ కుటుంబంలోకి కవల పిల్లలు వచ్చిన నేపథ్యంలో కూడా బుచ్చిబాబు ఎంతో ఆనందం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయన సోషల్ మీడియాలో కొణిదెల కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక పోస్ట్ పెట్టినట్టు అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. ఉపాసన.. బుచ్చిబాబు కూతురిపై చాలా ప్రేమ చూపిస్తున్నట్లు ఉన్నారంటూ మాట్లాడుకుంటున్నారు. పర్సనల్ లైఫ్ ను చాలా ప్రైవేట్‌ గా ఉంచే బుచ్చిబాబు.. తన కుటుంబాన్ని ఎక్కువగా మీడియాలోకి తీసుకురారు.

అయితే పెద్ది సినిమా షూటింగ్ సమయంలో ఆయన తన భార్య, కుమార్తెతో కలిసి సెట్స్‌ కు వెళ్లిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోల్లో రామ్ చరణ్‌తో బుచ్చిబాబు కుటుంబం ఎంతో ఆప్యాయంగా కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. దీంతో పెద్ది సినిమా కేవలం ఓ ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా రెండు కుటుంబాల మధ్య స్ట్రాంగ్ రిలేషన్ కు కారణమైందని చర్చ జరుగుతోంది. సినిమా విడుదలకు ముందు ఆ బాండింగ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.