Begin typing your search above and press return to search.

పెద్ది టికెట్ రేట్ల పెంపు.. బాక్సాఫీస్ లెక్కలు మారతాయా?

రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా పెద్ది కోసం ఇండస్ట్రీతో పాటు ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By:  M Prashanth   |   3 Jun 2026 10:30 AM IST
పెద్ది టికెట్ రేట్ల పెంపు.. బాక్సాఫీస్ లెక్కలు మారతాయా?
X

రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా పెద్ది కోసం ఇండస్ట్రీతో పాటు ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు సనా ఈ చిత్రాన్ని ఏ రేంజ్ లో తెరకెక్కించారు అనే క్యూరియాసిటీ అందరిలో కనిపిస్తోంది. సినిమా బడ్జెట్ కు తగ్గట్టుగానే థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా జరిగిందనే టాక్ నడుస్తోంది. ఆ బిజినెస్ టార్గెట్ చేరుకోవాలంటే ఓపెనింగ్స్ తో పాటు ఫుల్ రన్ లో సాలిడ్ కలెక్షన్స్ రాబట్టడం మేకర్స్ కు చాలా అవసరం.





ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన టికెట్ ధరల పెంపు జీవో ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఏపీ నుంచి సపోర్ట్ లభించిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన కొత్త ఉత్తర్వుల ప్రకారం థియేటర్ల యాజమాన్యాలకు పెద్ద ఊరట లభించింది. సింగిల్ స్క్రీన్స్ లో 100 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 125 ఐదు రూపాయలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ పెంపు అనేది జూన్ నాలుగవ తేదీ నుంచి పది రోజుల పాటు అమల్లో ఉండబోతోంది.

ఇక జూన్ మూడవ తేదీ రాత్రి వేసే ప్రీమియర్ షోల కోసం మేకర్స్ పక్కా కమర్షియల్ స్కెచ్ వేశారు. ఈ ఒక్క స్పెషల్ షోకి టికెట్ రేటును ఏకంగా 600 రూపాయలుగా ఫిక్స్ చేస్తూ అనుమతులు తెచ్చుకోవడం ఆసక్తికరంగా మారింది. చరణ్ కు ఉన్న మాస్ క్రేజ్ వల్ల డై హార్డ్ ఫ్యాన్స్ ఈ స్థాయి రేటు పెట్టినా థియేటర్లకు వెళ్తారు. దీనివల్ల బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ కు మంచి బూస్ట్ దొరుకుతుందని ట్రేడ్ వర్గాల అంచనా.

ఈ పది రోజుల విండో సినిమా ఫ్యూచర్ ను డిసైడ్ చేస్తుందని చెప్పవచ్చు. సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వస్తే ఈ పెరిగిన ధరల వల్ల డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్ లోకి చాలా త్వరగా వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఏమాత్రం బ్యాడ్ టాక్ వచ్చినా ఆ నెగిటివ్ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై గట్టిగా పడుతుంది. సినిమా మేకింగ్ ఖర్చులు భారీగా పెరిగిన ఈ రోజుల్లో నిర్మాతలు సేఫ్ అవ్వాలంటే రేట్లు పెంచుకోవడమే సులభమైన మార్గంగా కనిపిస్తోందనేది కొందరి వాదన.

పాన్ ఇండియా సినిమాలకు ఓపెనింగ్స్ ద్వారానే ఎక్కువ రికవరీ జరగాలి కాబట్టి మేకర్స్ ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ సామాన్యుడి కోణంలో ఆలోచిస్తే నలుగురు ఉన్న కుటుంబం సినిమాకు వెళ్లాలంటే వేలల్లో ఖర్చు చేయాల్సి రావడం అనేది లాంగ్ రన్ లో థియేటర్ల వ్యవస్థకే ఇబ్బందిగా మారుతుందనే కామెంట్స్ ఇండస్ట్రీ సర్కిల్స్ లోనే గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక చరణ్ పెద్ది విజయం కేవలం స్టార్ డమ్ పైనే కాకుండా ఈ పెరిగిన రేట్లను తట్టుకునే కంటెంట్ పై ఆధారపడి ఉంటుంది. ఎమోషన్స్ ప్రేక్షకులకు బలంగా కనెక్ట్ అయితే ఈ రేట్లు పెద్ద అడ్డంకి కాకపోవచ్చు. ఓవరాల్ గా ఈ పెరిగిన రేట్స్ తో జనాలు సినిమాను ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.