Begin typing your search above and press return to search.

'పెద్ది' షూటింగ్ ఎంతవరకు వచ్చింది? టీజర్ సంగతేంటి?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పెద్దిపై ఆడియన్స్ తో పాటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   18 March 2026 8:31 PM IST
పెద్ది షూటింగ్ ఎంతవరకు వచ్చింది? టీజర్ సంగతేంటి?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పెద్దిపై ఆడియన్స్ తో పాటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, చిత్రీకరణ పనులు ఇంకా కొనసాగుతుండటం కొంత ఆందోళన కలిగిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం షూటింగ్ చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్‌ లో షూటింగ్ జరుగుతోంది. ఇంకా చిత్రానికి సంబంధించిన కేవలం పది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఆ మిగిలిన భాగాన్ని కూడా వేగంగా పూర్తి చేయడానికి మేకర్స్ కృషి చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ పుట్టినరోజు అయిన మార్చి 27 నాటికి మొత్తం షూటింగ్‌ ను కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజును సెట్స్‌ లోనే గ్రాండ్‌ గా జరుపుకునే అవకాశం ఉందని వినికిడి. ఆ రోజు షూటింగ్ ముగిసిన వెంటనే సంప్రదాయంగా నిర్వహించే గుమ్మడి కాయ కొట్టే కార్యక్రమం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది సాధారణంగా సినిమా షూటింగ్ పూర్తయినప్పుడు జరిపే ప్రత్యేక వేడుక. దాని ద్వారా పెద్ది చిత్రీకరణ అధికారికంగా పూర్తవుతుందని అంతా భావిస్తారు.

ఇక టీజర్ విషయానికి వస్తే.. దర్శకుడు బుచ్చిబాబు సనా ఇప్పటికే దాని కోసం ఏర్పాట్లు చేశారని వార్తలు వస్తున్నాయి. అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ టీజర్‌ ను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా మార్చి 27వ తేదీన లేదా దానికి ముందు రోజు ఈవెనింగ్ టీజర్ విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

ఆ టీజర్ ద్వారా సినిమాపై మరింత హైప్ పెంచాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన పాటలు, పోస్టర్లు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు టీజర్ విడుదలైతే, సినిమా ప్రమోషన్స్ స్పీడప్ అయ్యే అవకాశం ఉంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న పెద్ది మూవీలో రామ్ చరణ్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని తెలుస్తోంది.

సినిమా స్టోరీ, ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతున్నాయని సమాచారం. మూవీలో హీరోయిన్‌ గా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తుండటం మరో ప్రత్యేకత. ఏదేమైనా సినిమా షూటింగ్ చివరి దశలో ఉండటం, త్వరలో టీజర్ విడుదలకు సిద్ధమవడం వంటి విషయాలు పెద్దిపై ఆసక్తి పెంచుతున్నాయి. ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమవుతున్న పెద్ది మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి. అభిమానులు మాత్రం రామ్ చరణ్ బర్త్‌ డే కానుకగా వచ్చే టీజర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.