శ్రీలంకలో పెద్ది చరణ్.. ఎందుకంటే..
'పెద్ది' షూటింగ్ ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తయిందని దర్శకుడు బుచ్చిబాబు రీసెంట్‌గా తెలిపారు.
By: M Prashanth | 24 Oct 2025 5:28 PM ISTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా అంటే ఇప్పుడు ప్రతీ అప్‌డేట్ ఒక సెన్సేషనే. 'RRR' తర్వాత గేమ్ ఛేంజర్ తో ఊహించని చేదు అనుభవం ఎదురైనప్పటికి పెద్ది సినిమాపై ఆ ప్రభావం అయితే కనిపించడం లేదు. పెద్ది మూవీ నెవ్వర్ బిఫోర్ అనేలా తెరపైకి రానున్నట్లు అర్ధమవుతుంది. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్, అనౌన్స్ అయినప్పటి నుంచే హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.
'పెద్ది' షూటింగ్ ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తయిందని దర్శకుడు బుచ్చిబాబు రీసెంట్‌గా తెలిపారు. ఇప్పుడు, నెక్స్ట్ షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ విదేశాలకు పయనమైంది. రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు, ఇతర టీమ్ సభ్యులు తాజాగా శ్రీలంకకు వెళ్లారు. ఎయిర్‌పోర్ట్‌లో చరణ్ స్టైలిష్ లుక్‌లో కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ శ్రీలంక షెడ్యూల్ వెనుక ఉన్న అసలు ప్లాన్ ఏంటంటే, అక్కడ ఒక బ్యూటిఫుల్ సాంగ్‌ను షూట్ చేయడమే. ఈ పాటను హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్‌లపై చిత్రీకరించనున్నారు. శ్రీలంకలోని అందమైన లొకేషన్లలో ఈ రొమాంటిక్ లేదా మెలోడీ సాంగ్‌ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో, ఈ పాటపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
బుచ్చిబాబు ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. రామ్ చరణ్‌ను మునుపెన్నడూ చూడని ఒక సరికొత్త అవతారంలో, మల్టిపుల్ లుక్స్‌తో చూపించబోతున్నాడు. దీనికోసం చరణ్ కూడా అంతే డెడికేషన్‌తో కష్టపడుతున్నాడు. విభిన్నమైన మేకోవర్లతో, హై-ఆక్టేన్ స్టంట్స్‌తో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా చరణ్ కెరీర్‌లో మరో బిగ్ హిట్ గా నిలిచిపోతుందని టీమ్ నమ్మకంగా ఉంది.
ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ఒక పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తుండగా, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి విలక్షణ నటులు కూడా భాగమయ్యారు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ లాంటి పెద్ద సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో, ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. మొత్తం మీద, 'పెద్ది' షూటింగ్ పక్కా ప్లానింగ్‌తో ముందుకు సాగుతోంది. 2026 మార్చి 27న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు.
