Begin typing your search above and press return to search.

శ్రీలంకలో 'పెద్ది' టీమ్.. ఆ లొకేషన్ వెనుక సీక్రెట్ ఏంటి?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ 'పెద్ది'పై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలిసిందే.

By:  M Prashanth   |   29 Oct 2025 12:38 PM IST
శ్రీలంకలో పెద్ది టీమ్.. ఆ లొకేషన్ వెనుక సీక్రెట్ ఏంటి?
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ 'పెద్ది'పై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలిసిందే. 'ఉప్పెన'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు సానా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో, ఇది రొటీన్ సినిమా కాదని ఆడియెన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఇప్పుడు మరో కీలకమైన షెడ్యూల్ కోసం శ్రీలంకకు వెళ్లింది.





లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, టీమ్ ప్రస్తుతం శ్రీలంకలో ఉంది. అక్కడ రామ్ చరణ్, జాన్వీ కపూర్‌లపై ఒక బ్యూటిఫుల్ సాంగ్‌ను షూట్ చేయాలని ప్లాన్ చేశారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండటంతో, ఈ పాట విజువల్‌గా, మ్యూజికల్‌గా చాలా గ్రాండ్‌గా ఉండబోతోందని టాక్. చరణ్ కూడా రీసెంట్‌గా శ్రీలంక వెళ్తూ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు.





ఈ నేపథ్యంలో, శ్రీలంక లొకేషన్స్ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫోటోలు బయటకు వచ్చాయి. డైరెక్టర్ బుచ్చిబాబు సానా, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో వాళ్లిద్దరూ ఒక పాత రైల్వే ట్రాక్ టన్నెల్ ముందు నిల్చుని ఉన్నారు.

ఈ లొకేషన్ చూస్తుంటే చాలా క్యూరియాసిటీ కలుగుతోంది. ఇది కేవలం సాంగ్ షూటింగ్ కోసమేనా లేక సినిమాలో ఏదైనా కీలకమైన సీన్ కోసం ఈ లొకేషన్‌ను వాడుకుంటున్నారా? అనే డిస్కషన్ మొదలైంది. ఆ రైల్వే ట్రాక్, ఆ టన్నెల్ బ్యాక్‌డ్రాప్ చూస్తుంటే, సినిమాలో ఏదో ఇంట్రెస్టింగ్ యాక్షన్ లేదా ఎమోషనల్ సీక్వెన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉందనిపిస్తోంది.

బుచ్చిబాబు, రత్నవేలు ఇద్దరూ చాలా క్లోజ్‌గా, డిస్కషన్ మోడ్‌లో ఉన్నట్లు ఆ ఫోటోల్లో కనిపిస్తోంది. రత్నవేలు లాంటి టాప్ సినిమాటోగ్రాఫర్ ఈ ప్రాజెక్ట్‌లో ఉండటంతో, విజువల్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ లొకేషన్ పిక్స్ ఆ అంచనాలను ఇంకా పెంచాయి.

మొత్తానికి, 'పెద్ది' టీమ్ శ్రీలంకలో ఫుల్ స్వింగ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్‌ను మల్టిపుల్ లుక్స్‌లో చూపించబోతున్నారని, ఇది ఆయన కెరీర్‌లో ఒక మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుందని అంటున్నారు. 2026 మార్చి రిలీజ్ టార్గెట్‌తో సినిమా శరవేగంగా రూపుదిద్దుకుంటోంది.