Begin typing your search above and press return to search.

'పెద్ది' ఐటం భామ కోసం గురువే దిగాలేమో!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న‌ భారీ చిత్రం `పెద్ది`పై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

By:  Srikanth Kontham   |   23 April 2026 8:00 AM IST
పెద్ది ఐటం భామ కోసం గురువే దిగాలేమో!
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న‌ భారీ చిత్రం `పెద్ది`పై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. షూటింగ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అయితే సినిమాలో ప్రత్యేక గీతం కోసం సరైన భామను ఎంపిక చేయడంలో దర్శకుడు బుచ్చిబాబు ఇంకా ఒక కొలిక్కి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. తొలుత ఈ పాట కోసం మృణాల్ ఠాకూర్ ఫైనల్ అయ్యిందని ప్రచారం జ‌రిగినా? తాజా సమాచారం ప్రకారం ఆ జాబితా మళ్ళీ మొదటికే వచ్చింది. ఈ నేప‌థ్యంలో ఐటమ్ సాంగ్ రేసులోకి కొత్త పేర్లు వినిపిస్తున్నాయి.

మానస వారణాసి, సంయుక్తా మీనన్ పేర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మానస వారణాసి అందం, హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకోగలదని కొందరు భావిస్తుంటే? సంయుక్తా మీనన్ ఇమేజ్‌తో ప్రత్యేక గీతానికి కొత్త గ్లామర్ తీసుకురాగలదని మరికొందరు భావిస్తున్నారు. దీంతో వీరిద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో దర్శకుడు సందిగ్ధంలోనే ఉన్నట్లు మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా బుచ్చిబాబు సినిమాల్లో ప్రతి పాత్రను, ప్రతి పాటను ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేస్తారు. `ఉప్పెన`తో సత్తా చాటిన ఆయన రామ్ చరణ్ వంటి పెద్ద స్టార్‌తో సినిమా చేసేటప్పుడు చిన్న పొరపాటు కూడా జరగకూడదని భావిస్తున్నాడు.

అందుకే ఐటమ్ సాంగ్ విషయంలో బుచ్చిబాబు అంతగా తడబడుతున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పాత్రకు సరిపోయే గ్లామర్ , డ్యాన్స్ స్కిల్స్ ఉన్న నటి కోసం వెతుకులాట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐటమ్ గాళ్ పంచాయితీ తెగాలంటే బుచ్చిబాబు గురువు సుకుమార్ రంగంలోకి దిగాలేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుకుమార్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ ఎంతటి సంచలనం సృష్టిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. `పుష్ప`లో `ఊ అంటావా మామ.. నుండి `రంగస్థలం`లో జిగేల్‌ రాణి వరకు ఆయన ఎంపిక ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది.

తన శిష్యుడు ఎంపికలో తడబడుతున్నట్లు కనిపిస్తుండటంతో సుకుమార్ స్వయంగా సరైన భామను సూచించే అవకాశం ఉందని టాక్. ఇప్ప‌టికే రెహ‌మాన్ అదిరిపోయే మాస్ సాంగ్ సిద్దం చేసిన‌ట్లు చిత్ర వ‌ర్గాల నుంచి తెలుస్తోంది. మృణాల్ ఠాకూర్ నుండి మానస వారణాసి వరకు రకరకాల పేర్లు వినిపించినా? చివరికి ఆ లక్కీ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూడాలి. ఈ విష‌యంలో శిష్యుడు తప్ప‌క గురువు స‌ల‌హా తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తుంది. మరి ఈ ఐటమ్ గాళ్ ఎవరో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.