Begin typing your search above and press return to search.

మెలోడీ కోసం మైసూరుకి?

దీంతో త‌న ఆశ‌ల‌న్నింటినీ త‌న త‌ర్వాతి సినిమాగా వ‌స్తోన్న పెద్ది పైనే పెట్టుకున్నారు చ‌ర‌ణ్. సుకుమార్ శిష్యుడు, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన ఈ పెద్ది సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   23 Aug 2025 2:00 PM IST
మెలోడీ కోసం మైసూరుకి?
X

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ ఎన్నో అంచనాలు పెట్టుకుని శంక‌ర్ తో గేమ్ ఛేంజ‌ర్ సినిమా చేస్తే అది కాస్తా డిజాస్ట‌ర్ గా నిలిచింది. దీంతో త‌న ఆశ‌ల‌న్నింటినీ త‌న త‌ర్వాతి సినిమాగా వ‌స్తోన్న పెద్ది పైనే పెట్టుకున్నారు చ‌ర‌ణ్. సుకుమార్ శిష్యుడు, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన ఈ పెద్ది సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచ‌నాల‌ను ఏర్ప‌ర‌చుకుంది.

పెద్దితో బుచ్చిబాబు భారీ ప్లాన్

విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం చ‌ర‌ణ్ చాలా క‌ష్ట‌ప‌డుతున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా పెద్ది కోసం మేకోవ‌ర్ అవుతున్నారు చర‌ణ్. సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను ఏ మాత్రం తీసిపోకుండా ఈ సినిమాను రూపొందిస్తున్న బుచ్చిబాబు, ఈ మూవీతో నెక్ట్స్ లెవెల్ స‌క్సెస్ ను అందుకోవాల‌ని ప్లాన్ చేశారు.

పెద్ది ఫ‌స్ట్ షాట్ కు సూప‌ర్ రెస్పాన్స్

ఆల్రెడీ పెద్ది నుంచి ఫ‌స్ట్ షాట్ రూపంలో ఓ చిన్న గ్లింప్స్ ను మేక‌ర్స్ రిలీజ్ చేయ‌గా దానికి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వ‌చ్చింది. ఈ సినిమా గురించి ఇప్ప‌టికే చాలా మంది ప్ర‌ముఖులు ఎంతో గొప్ప‌గా చెప్పారు. ఒక్క సిట్టింగ్ లోనే తాను సినిమాను ఓకే చేశాన‌ని క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ చెప్ప‌గా, పెద్ది క‌థ త‌న‌నెంతో ఎగ్జైట్ చేసిందని, ఆ ఎగ్జైట్మెంటే త‌నను ఈ సినిమా చేసేలా చేస్తుంద‌ని ఏఆర్ రెహ‌మాన్ చెప్పారు.

శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఓ అప్డేట్ వినిపిస్తోంది. పెద్ది సినిమాలోని ఓ సాంగ్ ను మేక‌ర్స్ మైసూరులో ప్లాన్ చేస్తున్నార‌ని, ఆగ‌స్ట్ 26 లేదా 27 నుంచి ఆ సాంగ్ ను తెర‌కెక్కించే అవ‌కాశాలున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సాంగ్ రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్ పై తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. వీలైనంత త్వ‌ర‌గా సినిమాను పూర్తి చేసి, వ‌చ్చే ఏడాది మార్చిలో పెద్దిని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు బుచ్చిబాబు.