Begin typing your search above and press return to search.

పెద్ది 'చికిరి చికిరి'.. కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

ఒకవైపు ఈ పాట సినిమాకు పెద్ద ఎత్తున ప్రచారం తీసుకొచ్చిందని అభిమానులు చెబుతుండగా, మరోవైపు ఇదే కంటెంట్‌ను ట్రోలింగ్‌ కు ఉపయోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

By:  M Prashanth   |   16 Jun 2026 6:48 PM IST
పెద్ది చికిరి చికిరి.. కావాలనే టార్గెట్ చేస్తున్నారా?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా రెండో వీక్ లో కూడా సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది. అయితే సినిమా విడుదలై 12 రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ ప్రేక్షకుల్లో, సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చకు వస్తున్న అంశం మాత్రం జాన్వీ కపూర్ పాత్రే. ముఖ్యంగా చికిరి చికిరి పాట.. ఇప్పుడు మళ్లీ ఆ చర్చను తెరపైకి తీసుకొచ్చింది.

నిజానికి సినిమా రిలీజ్ కు ముందే చికిరి చికిరి సాంగ్ భారీ హైప్‌ ను సొంతం చేసుకుంది. మిలియన్ల కొద్దీ వ్యూస్, లక్షల సంఖ్యలో రీల్స్‌ తో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సాంగ్ వైరల్ అయింది. రామ్ చరణ్ కెరీర్‌లోనే కాకుండా, ఇటీవలి కాలంలో పెద్ద హీరోల సాంగ్స్ కు వచ్చిన రెస్పాన్స్ తో పోలిస్తే కూడా చికిరి చికిరికి వచ్చిన ఆదరణ మామూలుగా లేదని చెప్పాలి. నార్త్ లో కూడా భారీ స్పందన తెచ్చుకుంది.

అయితే, సినిమా విడుదల తర్వాత పరిస్థితి మారింది. పాటలో జాన్వీ కపూర్‌ ను చిత్రీకరించిన తీరు, కొన్ని క్లోజప్ షాట్లపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె పాత్రను, గ్లామర్‌ ను అవసరానికి మించి చూపించారని కొందరు అభిప్రాయపడ్డారు. ఆ అంశం పెద్ద ఎత్తున చర్చకు దారితీయడంతో దర్శకుడు బుచ్చిబాబు కూడా స్పందించారు. ఆడియన్స్ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నామని, కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేసినట్లు చెప్పారు.

అలాగే త్వరలో జాన్వీ పాత్రకు సంబంధించిన మరికొన్ని సీన్స్ ను యాడ్ చేస్తామని వెల్లడించారు. ఇలాంటి టైమ్ లోనే తాజాగా చికిరి చికిరి ఫుల్ వీడియో సాంగ్‌ ను విడుదల చేయడం మరోసారి చర్చకు కారణమైంది. ఇప్పటికే వివాదానికి సెంటర్ గా మారిన విజువల్స్‌ ను దాదాపు అలాగే విడుదల చేయడంతో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకవైపు ఈ పాట సినిమాకు పెద్ద ఎత్తున ప్రచారం తీసుకొచ్చిందని అభిమానులు చెబుతుండగా, మరోవైపు ఇదే కంటెంట్‌ను ట్రోలింగ్‌ కు ఉపయోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా కొందరు పాటలోని కొన్ని షాట్లను కట్ చేసి, వేరే బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి వైరల్ చేస్తున్నట్లు అభిమానులు ఆరోపిస్తున్నారు. జాన్వీ పాత్రను కావాలనే తప్పుగా చూపించే ప్రయత్నం జరుగుతోందని, ఇది టార్గెట్ చేసిన ప్రచారంలా కనిపిస్తోందని మెగా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

అయితే మరోవైపు, ప్రేక్షకులు అభ్యంతరాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయలేమని మూవీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. సినిమా విడుదల తర్వాత ఆడియన్స్ అభిప్రాయాలు, క్యాస్టింగ్ యాక్టింగ్ పై వచ్చే రెస్పాన్స్ ను మూవీ టీమ్ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా చికిరి చికిరి పాటకు వచ్చిన భారీ రెస్పాన్స్, ఆ తర్వాత తలెత్తిన వివాదం, ఇప్పుడు ఫుల్ వీడియో విడుదలతో మళ్లీ మొదలైన ట్రోలింగ్.. ఇవన్నీ కలిసి పెద్ది చుట్టూ మరోసారి చర్చకు దారితీశాయి. ఇది నిజంగా ప్రేక్షకుల రెస్పాన్స్? లేక కావాలనే ఒక కొందరు సాంగ్ తోపాటు జాన్వీ రోల్ ను టార్గెట్ చేస్తున్నారా? అన్న ప్రశ్నలు మాత్రం మెగా అభిమానుల్లో ఇప్పుడు తలెత్తుతున్నాయి.