Begin typing your search above and press return to search.

ఇద్దరు హీరోయిన్స్‌ను కాదని.. శ్రుతి హాసన్‌ మాత్రమే ఎందుకు?

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న 'పెద్ది' సినిమా సాంగ్స్, కాస్టింగ్ పై ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడుస్తోంది.

By:  Madhu Reddy   |   25 May 2026 11:57 AM IST
ఇద్దరు హీరోయిన్స్‌ను కాదని.. శ్రుతి హాసన్‌ మాత్రమే ఎందుకు?
X

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న 'పెద్ది' సినిమా సాంగ్స్, కాస్టింగ్ పై ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడుస్తోంది. ముఖ్యంగా మృణాల్ ఠాకూర్, మానస వారణాసి లాంటి క్రేజీ నేమ్స్ వినిపించినా.. ఫైనల్‌గా శ్రుతి హాసన్‌ను ఎంచుకోవడం వెనుక అసలు కథ ఏంటి? ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మ్యాజిక్ థియేటర్లలో ఎలా ఉండబోతోంది? నెగిటివిటీని దాటుకుని ఈ సినిమా జూన్ 4న ఎలాంటి హైప్ క్రియేట్ చేయనుంది? ఆ విశేషాలు చూద్దాం..

మృణాల్, మానసలను ఎందుకు వద్దనుకున్నారు?:

ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ రేసులో మొదట మృణాల్ ఠాకూర్ లాంటి ఫుల్ క్రేజ్ ఉన్న స్టార్, లేదా మానస వారణాసి లాంటి ఫ్రెష్ ఫేస్ నటిస్తారని ప్రచారం జరిగింది. కానీ లాస్ట్ మినిట్‌లో శ్రుతి హాసన్ వైపు మొగ్గు చూపారు. ఇక దీనికి మెయిన్ రీజన్ డేట్స్ అడ్జస్ట్‌మెంట్ సమస్యలని తెలుస్తోంది. అలాగే ప్రొడక్షన్ లేట్ అవ్వడం వల్ల, రిస్క్ తీసుకోకుండా ఆల్రెడీ 'ఎవడు' సినిమాతో చరణ్‌కు హిట్ కాంబినేషన్ అయిన శ్రుతి హాసన్ వైపు వెళ్లినట్లు టాక్.

రెహమాన్ మార్క్ స్లో పాయిజన్:

ఇక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ విషయానికొస్తే.. ఆయన రొటీన్ డప్పుల సౌండ్ కాకుండా విభిన్నమైన ఇన్‌స్ట్రుమెంటేషన్ వాడుతుంటారు. ఇక ఈ పాట కోసం దాదాపు 50 రోజులు వర్క్ చేశారంటే సౌండ్ ఇంజనీరింగ్‌లో ఏదో కొత్తదనం ట్రై చేశారని అర్థమవుతోంది. ఇక రెహమాన్ పాటలు మొదటిసారి విన్నప్పుడు యావరేజ్‌గా అనిపించినా, వినగా వినగా ఎక్కేస్తాయి. ఇప్పటికే రిలీజ్ అయినా రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి తాజాగా వచ్చిన 'హెల్లాల్లల్లో' హుక్ లైన్ ఆల్రెడీ క్యాచీగా ఉంది కాబట్టి, రీల్స్ తో తక్కువ టైం లో ఇది వైరల్ అవ్వడం ఖాయం.

థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కీలకం:

మాస్ ఆడియన్స్‌కి థియేటర్లలో లౌడ్ స్పీకర్లలో వచ్చే బేస్, బీట్ చాలా ముఖ్యం. దానికి తోడు స్క్రీన్ పై చరణ్ డాన్స్ స్పీడ్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే ఈ పాట రేంజ్ మారిపోతుంది. ఇక ట్రైలర్‌కు కొంచెం యావరేజ్ టాక్ వచ్చిన నేపథ్యంలో, జూన్ 4న రాబోయే ఓపెనింగ్స్‌కి ఈ సాంగ్ ఎంతవరకు హైప్ తెస్తుందనేది ఇక్కడ అసలు ప్రశ్న. లేట్ ప్రొడక్షన్ ప్రెజర్ వల్ల ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్‌పై కాస్త ప్రభావం పడిందనే టాక్ నడుస్తుంది.ఐతే సాంగ్ థియేటర్లలో రిలీజ్ అయ్యాక పోసిటివ్ టాక్ వస్తే మూవీ దూసుకుపోవటం ఖాయం.

ఇక పెద్ది’ టీమ్ ఈ పాటను భోపాల్‌లో జరిగిన ఈవెంట్‌లో విడుదల చేస్తూ, ఉత్తర భారతంలో కూడా ప్రమోషన్స్‌ను స్ట్రాంగ్ గా కొనసాగించేందుకు ప్లాన్ చేసింది.ఇక ప్రమోషనల్ కంటెంట్ కంటే థియేట్రికల్ కంటెంట్ బలంగా ఉంటే, ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్న నెగిటివిటీ అంతా సినిమా రిలీజ్ అయిన ఒక్క రోజులోనే కొట్టుకుపోయే ఛాన్స్ ఉంది.

హీరోయిన్ మార్పు, మ్యూజిక్ పరంగా వస్తున్న కామెంట్స్ ఎలా ఉన్నా.. బుచ్చిబాబు మార్క్ టేకింగ్, చరణ్ మాస్ ఇమేజ్, రెహమాన్ మ్యాజిక్ పైనే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంది. ఇక జూన్ 4న థియేటర్లలో ఈ కాంబినేషన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.