Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ ముందుకు హై వోల్టేజ్ వైబ్ తో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు, అభిమానుల్లో సందడి మామూలుగా ఉండదు.

By:  M Prashanth   |   26 March 2026 10:43 PM IST
ఫ్యాన్స్ ముందుకు హై వోల్టేజ్ వైబ్ తో రామ్ చరణ్
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు, అభిమానుల్లో సందడి మామూలుగా ఉండదు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న 'పెద్ది' సినిమా షూటింగ్ లో చరణ్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనౌన్స్ మెంట్ నుండే అంచనాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా శర్వానంద్, రాజశేఖర్ వంటి స్టార్స్ ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగింది.

​ఇటీవల సోషల్ మీడియాలో చరణ్ ఆరోగ్యానికి సంబంధించి కొన్ని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. 'పెద్ది' సినిమా సెట్స్ లో చరణ్ కు గాయమైందని, యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని కథనాలు వచ్చాయి. దీంతో మెగా అభిమానులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. సినిమా షూటింగ్ కు ఏమైనా బ్రేక్ పడుతుందా? రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు ఎలా జరుగుతాయి? అని చాలా మంది కంగారు పడ్డారు. ఇక నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చినా, అభిమానుల్లో టెన్షన్ పూర్తిగా తగ్గలేదు.

​ఈ నేపథ్యంలో రామ్ చరణ్ స్వయంగా రంగంలోకి దిగారు. తన పుట్టినరోజు (మార్చి 27)కు ఒక రోజు ముందే 'పెద్ది' సెట్స్ కు వచ్చిన అభిమానులను ఆయన కలుసుకున్నారు. ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ, తాను పూర్తిగా క్షేమంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. కంటికి చిన్నపాటి చికిత్స జరిగిన మాట వాస్తవమే అయినా, అది చెబుతున్నంత తీవ్రమైనది కాదని స్పష్టం చేశారు. "నేను బాగున్నాను, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని చరణ్ చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

​ఈ సందర్భంగా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ షర్ట్ లో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్న చరణ్, అభిమానులతో సరదాగా ముచ్చటించారు. వారితో కలిసి సెల్ఫీలు కూడా తీసుకున్నారు. చరణ్ మాటల్లోని కాన్ఫిడెన్స్ చూస్తే ఆయన గాయం నుండి పూర్తిగా కోలుకున్నారని అర్థమవుతోంది. షూటింగ్ యధావిధిగా సాగుతుందని, తన పుట్టినరోజు వేడుకలు కూడా ప్లాన్ చేసినట్లే జరుగుతాయని ఆయన హామీ ఇచ్చారు. ఒక స్టార్ హీరోగా ఉండి కూడా అభిమానుల ఆందోళనను అర్థం చేసుకుని, స్వయంగా ఫ్యాన్స్ ముందుకు వచ్చి సేల్ఫీ వీడియో కూడా ఇవ్వడం విశేషం.

​రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న 'పెద్ది' సినిమా టీజర్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ టీజర్ తోనే సినిమా కంటెంట్ ఏంటో, చరణ్ లుక్ ఏంటో ప్రపంచానికి చూపించాలని బుచ్చిబాబు టీమ్ భావిస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో చరణ్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని సమాచారం. అలాగే సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమాపై కూడా ఏమైనా క్లారిటీ ఇస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో.