పెద్ది సెకండ్ సింగిల్… స్క్రీన్స్‌పై ఫైర్ ఖాయమట!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 26 Feb 2026 5:43 PM ISTమెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ సింగిల్ చికిరి సాంగ్ రిలీజైన క్షణం నుంచి సోషల్ మీడియా ట్రెండ్‌లను షేక్ చేస్తూ గ్లోబల్ యాంథెమ్ గా మారింది. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ బిలియన్‌కు పైగా రీల్స్‌ను దాటిందన్న సమాచారం ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని కలిగించగా, ముఖ్యంగా ఈ సాంగ్ లో రామ్ చరణ్ స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావడం సినిమాపై క్రేజ్‌ను మరింత పెంచింది.
మార్చి 2న పెద్ది సెకండ్ సింగిల్ రయ్ రయ్ రా రా..
ఇప్పుడు ఆ హైప్‌ను మరింత పెంచేందుకు మేకర్స్ పెద్ది నుంచి సెకండ్ సింగిల్ రయ్ రయ్ రా రా.. సాంగ్ కు రెడీ అయ్యారు. మార్చి 2న హోలీ పండుగ సందర్భంగా ఈ సాంగ్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా, ఇది పూర్తి స్థాయి డ్యాన్స్ నంబర్‌గా ఉండబోతోందని సమాచారం. ఫస్ట్ సింగిల్ చికిరి సాంగ్ ను మించి ఈ సాంగ్ పాపులారిటీని సాధిస్తుందని యూనిట్ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.
విజువల్ స్పెక్టకిల్ గా తీర్చిదిద్దుతున్న బుచ్చి
అంతే కాదు, ఈ సాంగ్ ను డైరెక్టర్ బుచ్చిబాబు సాన గ్రాండ్ విజువల్ స్పెక్టకిల్‌గా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ స్టైల్, స్వాగ్, ఎనర్జీని పూర్తిస్థాయిలో వినియోగించేలా కొరియోగ్రఫీ ప్లాన్ చేశారట. ప్రతి ఫ్రేమ్‌లోనూ భారీ కాన్వాస్ కనిపించేలా, ఆడియన్స్ ను థియేటర్లలో కుర్చీల్లో కూర్చోనివ్వకుండా చేసేలా ఈ సాంగ్ పిక్చరైజేషన్ ఉంటుందని తెలుస్తోంది.
ఏప్రిల్ 30న పెద్ది రిలీజ్
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, ఆమె గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందంటున్నారు. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో నటించనున్న ఈ పాన్ ఇండియన్ మూవీ విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ లో వెంకట సతీష్ కిలారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మరి హోలీ సందర్భంగా రాబోతున్న పెద్ది సెకండ్ సింగిల్ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
