ఆ విషయంలో జక్కన్నను ఫాలో అవుతున్న చరణ్
రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది అనే పాన్ ఇండియా ప్రాజెక్టు చేస్తున్న సంగతి తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 4 Oct 2025 11:00 PM ISTఒక సినిమా విషయంలో ఏం చేయాలన్నా అది రిలీజ్ కు ముందేనని, ఒక్కసారి సినిమా థియేటర్లలో రిలీజై, ప్రేక్షకుల దగ్గరకు వెళ్లాక ఏం చేయలేమని, అందుకే తాను ప్రతీ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటూ కాస్త లేటైనా మంచి అవుట్‌పుట్ వచ్చే వరకు ప్రయత్నిస్తూనే ఉంటానని దర్శకధీరుడు రాజమౌళి పలుమార్లు చెప్పారు. జక్కన్నతో రెండు సినిమాలు చేసిన అనుభవమో ఏమో కానీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇప్పుడిదే ఫాలో అవుతున్నారు.
పెద్ది పర్ఫెక్షన్ కోసం బుచ్చిబాబు స్పెషల్ కేర్
రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది అనే పాన్ ఇండియా ప్రాజెక్టు చేస్తున్న సంగతి తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా కోసం ప్రతీదీ పర్ఫెక్ట్ గా ఉండాలని బుచ్చిబాబు ఎంతో కేర్ తీసుకుంటుండగా, రామ్ చరణ్ కూడా బుచ్చిబాబుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తున్నట్టు తెలుస్తోంది.
2026 జనవరి వరకు పెద్దితోనే చరణ్
అందులో భాగంగానే పెద్ది సినిమాకు రామ్ చరణ్ భారీ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. వాస్తవానికి రామ్ చరణ్ వీలైనంత త్వరగా పెద్ది సినిమాను పూర్తి చేసి, డిసెంబర్ 2025 నాటికి సుకుమార్ లేదా బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ భట్ తో సినిమాను మొదలుపెట్టాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ పెద్ది సినిమా అవుట్‌పుట్ మెరుగ్గా ఉండటం కోసం చరణ్ ఈ సినిమా కోసం మరికొన్నాళ్ల పాటూ తన కాల్షీట్స్ ను పొడిగించినట్టు తెలుస్తోంది.
2026 జనవరి వరకు రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం వర్క్ చేయనున్నారని సమాచారం. చరణ్ సహకారంతో డైరెక్టర్ బుచ్చిబాబు సానకు పూర్తిగా క్రియేటివ్ స్పేస్ దొరకనుండటం ఖాయం. డైరెక్టర్ కు క్రియేటివ్ స్పేస్ ఇస్తే ఎప్పుడైనా మంచి అవుట్‌పుట్ వచ్చే అవకాశముంటుంది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, శివ రాజ్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
