చరణ్ పెద్ది.. ఆ రెండింటిలో ఒకటి..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ విడుదలపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చలకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది.
By: M Prashanth | 7 April 2026 11:05 AM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ విడుదలపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చలకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది. ఏప్రిల్ 30న ఈ సినిమా వస్తుందని స్వయంగా చరణ్ చెప్పినప్పటికీ, పరిస్థితులను చూస్తుంటే వాయిదా తప్పేలా లేదు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పీరియడ్ డ్రామా షూటింగ్ ఇంకాస్త పెండింగ్ ఉండటంతో పాటు, టెక్నికల్ పనులు కూడా అనుకున్న స్పీడ్ లో జరగడం లేదని తెలుస్తోంది. దీంతో సినిమాను ఏప్రిల్ నుంచి జూన్ కి మార్చాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు సమాచారం.
సాధారణంగా ఒక భారీ బడ్జెట్ సినిమా విడుదల తేదీ మారుతుందంటే దాని వెనుక చాలా లెక్కలు ఉంటాయి. కేవలం షూటింగ్ మాత్రమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర సోలో రిలీజ్ దొరకడం కూడా ముఖ్యం. ఏప్రిల్ చివర్లో రావడం కంటే, జూన్ లో సమ్మర్ చివరి హాలిడేస్ మూడ్ ని అడ్వాంటేజ్ ను వాడుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే మెగా అభిమానులు కొంత నిరాశ చెందినప్పటికీ, అవుట్ పుట్ పక్కాగా రావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
పెద్ది విడుదల కోసం మేకర్స్ ఇప్పుడు రెండు కొత్త తేదీలను పరిశీలిస్తున్నారు. జూన్ 04 లేదా జూన్ 25 తేదీలలో ఏదో ఒక రోజు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. జూన్ మొదటి వారంలో వస్తే సమ్మర్ హాలిడేస్ ముగింపు సమయంలో మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అది కుదరకపోతే జూన్ చివరి వారమే ఫైనల్ కావొచ్చు.
ఈ వాయిదాకు ప్రధాన కారణం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జరుగుతున్న ఆలస్యమే అని తెలుస్తోంది. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ అందించాల్సిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా కీలక దశలోనే ఉంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో బుచ్చిబాబు ఈ అదనపు సమయాన్ని తీసుకుంటున్నట్లు సమాచారం. రామ్ చరణ్ కూడా ప్రస్తుతం మిగిలిన షూటింగ్ పార్ట్ పూర్తి చేయడంపైనే దృష్టి పెట్టారు. ఒక వారం రోజుల్లో ప్యాచ్ వర్క్ ముగించి పూర్తిస్థాయిలో ప్రమోషన్లలోకి దిగాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.
ఈ మార్పు వల్ల ఇతర సినిమాల డేట్స్ పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ‘పెద్ది’ ఏప్రిల్ నుంచి తప్పుకోవడంతో ఆ గ్యాప్ ను భర్తీ చేయడానికి కొన్ని మీడియం రేంజ్ సినిమాలు పోటీ పడే ఛాన్స్ ఉంది. అయితే చరణ్ వంటి స్టార్ హీరో సినిమా జూన్ లో రావడం అంటే బాక్సాఫీస్ వద్ద మళ్ళీ సందడి మొదలైనట్లే. ఏప్రిల్ 30 డేట్ మిస్ అవ్వడం కొంత బ్యాడ్ న్యూస్ అయినా, పక్కాగా సిద్ధమై జూన్ లో రావడం బెటర్ అనేది మరికొందరి వాదన.
మరోవైపు మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను జూన్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ సినిమా గ్రాఫిక్స్ విషయంలో కూడా కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దీంతో హడావుడి లేకుండా చరణ్ కోసం కూడా డ్రాప్ అయ్యే అవకాశం లేకపోలేదు.ఇక ‘పెద్ది’ టీమ్ ఇప్పుడు కొత్త డేట్స్ కసరత్తులో నిమగ్నమైంది. రెండింటిలో ఏ తేదీన మెగా పవర్ స్టార్ థియేటర్లలోకి వస్తారో తెలియాలంటే మేకర్స్ నుంచి క్లారిటీ రావాలి. హనుమాన్ జయంతి పోస్టర్ లో రిలీజ్ డేట్ ఎందుకు వేయలేదనే దానికి ఇప్పుడు సమాధానం దొరికినట్లయింది. మరి ఈ అదనపు సమయం సినిమాకు ఏ మేరకు హెల్ప్ అవుతుందో వేచి చూడాలి.
