Begin typing your search above and press return to search.

పెద్ది కౌంట్ డౌన్.. ఇక హౌస్‌ ఫుల్స్ సందడేనా?

చాలా కాలం తర్వాత ఒక పెద్ద స్టార్ హీరో సినిమా థియేటర్లలోకి వస్తుండటంతో ప్రేక్షకులతో పాటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఓ రేంజ్ లో ఆశలు పెట్టుకున్నారు.

By:  M Prashanth   |   3 Jun 2026 4:22 PM IST
పెద్ది కౌంట్ డౌన్.. ఇక హౌస్‌ ఫుల్స్ సందడేనా?
X

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో పెద్ది ఒకటి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఆ భారీ పాన్ ఇండియా చిత్రం విడుదలకు సిద్ధమవుతుండటంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చాలా కాలం తర్వాత ఒక పెద్ద స్టార్ హీరో సినిమా థియేటర్లలోకి వస్తుండటంతో ప్రేక్షకులతో పాటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఓ రేంజ్ లో ఆశలు పెట్టుకున్నారు.

అయితే ఈ ఏడాది సంక్రాంతి సీజన్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సినిమాల సందడి అంతగా కనిపించలేదు. మీడియం రేంజ్, చిన్న సినిమాలు వరుసగా విడుదలైనా, భారీ స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే స్టార్ హీరో సినిమా మాత్రం రాలేదు. దీంతో అనేక ప్రాంతాల్లో థియేటర్ల ఆక్యుపెన్సీ ఆశించిన స్థాయిలో లేకపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితిని ఛేంజ్ చేసే మూవీగా పెద్దిని అంతా భావిస్తున్నారు.

నిజానికి ఆ సినిమా ప్రకటించినప్పటి నుంచే ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఉప్పెనతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు సనా, రామ్ చరణ్‌ తో చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో మొదటినుంచే ఆసక్తి పెరిగింది. దీనికి తోడు సినిమా కోసం సెలెక్ట్ చేసిన క్రూ అండ్ క్యాస్టింగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.

ముఖ్యంగా విలేజ్ బ్యాక్ డ్రాప్, స్పోర్ట్స్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ తో కూడిన కథతో సినిమా తెరకెక్కుతుండడం ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది. రామ్ చరణ్ కొత్త లుక్, రోల్స్ క్యారెక్టరైజేషన్ కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. సినిమా విడుదలకు ముందు మూవీ టీమ్ ఓ రేంజ్ లో ప్రమోషన్లు నిర్వహించింది. సౌత్ స్టేట్స్ తో పాటు నార్త్ లో పలు నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ చేపట్టింది. దీంతో పెద్దిపై పాన్ ఇండియా వైడ్ గా కూడా దృష్టి పడింది.

విడుదల తేదీ వరకు సినిమాపై ఉన్న హైప్ తగ్గకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకుంది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే, రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో టికెట్లకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అంతే కాదు.. ఫస్ట్ డే షోలు హౌస్ ఫుల్ అయిపోయినట్లు సమాచారం. దీంతో థియేటర్ యజమానులు సాలిడ్ వసూళ్లపై హోప్స్ పెట్టుకున్నారు. అయితే ఒక సినిమా విజయాన్ని చివరికి నిర్ణయించేది ప్రేక్షకుల రెస్పాన్స్.

భారీ అంచనాలు, స్ట్రాంగ్ ప్రమోషన్స్, అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ఉన్నప్పటికీ విడుదల తర్వాత వచ్చే టాక్ కీలకంగా మారనుంది. కథ, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల థియేటర్లలో మళ్లీ హౌస్‌ ఫుల్ బోర్డులు కనిపిస్తాయి. ఏదేమైనా పెద్దిపై ప్రస్తుతం ఉన్న అంచనాలు చూస్తే బాక్సాఫీస్ వద్ద హై రేంజ్ ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ అంచనాలను సినిమా ఎంతవరకు అందుకుంటుందో.. విడుదల తర్వాత ప్రేక్షకుల జడ్జిమెంట్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.