Begin typing your search above and press return to search.

చరణ్ 'పెద్ది'.. కెరీర్ లో ఇదే ఫస్ట్ టైమ్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

By:  M Prashanth   |   21 April 2026 8:46 PM IST
చరణ్ పెద్ది.. కెరీర్ లో ఇదే ఫస్ట్ టైమ్?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే సినిమా విడుదల తేదీ విషయంలో వరుస వాయిదాలు పడుతుండటంతో అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. మొదట ఏప్రిల్ చివరిలో రిలీజ్ చేయాలని భావించిన చిత్రబృందం, ఇప్పుడు జూన్ నెలకు వాయిదా వేసింది. అయినప్పటికీ కచ్చితమైన తేదీని ఇంకా ప్రకటించలేదు.

సినిమా ఆలస్యంపై మేకర్స్ మాత్రం స్పష్టత ఇస్తూనే ఉన్నారు. ప్రేక్షకులకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్న లక్ష్యంతోనే జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. ముఖ్యంగా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రతి ఫ్రేమ్‌ ను ఎంతో శ్రద్ధగా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే టాకీ పార్ట్ దాదాపు పూర్తవ్వగా, ఒక పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది.

మ్యూజిక్ విషయంలో కూడా పెద్ది ప్రత్యేకతను సంతరించుకుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన రావడంతో ఆల్బమ్‌పై అంచనాలు మరింత పెరిగాయి. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయి.

ఇక సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర అంశం హీరో రెమ్యూనరేషన్. తాజా సమాచారం ప్రకారం, రామ్ చరణ్ పెద్ది చిత్రానికి సుమారు రూ.120 కోట్ల వరకు పారితోషికం అందుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదే ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు అత్యధిక రెమ్యూనరేషన్‌ అని ఇప్పుడు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారింది.

అయితే పెద్ది సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా నటిస్తున్నారు. అలాగే శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మితమవుతోంది. కథ పరంగా చూస్తే, ఉత్తరాంధ్ర నేపథ్యంతో క్రికెట్ బ్యాక్‌ డ్రాప్‌ లో సినిమా రూపొందుతోంది.

ఇందులో రామ్ చరణ్ కొత్త మాస్ లుక్‌ లో కనిపించనున్నారు. గుబురు గడ్డం, రఫ్ బాడీ లాంగ్వేజ్‌ల తో విడుదలైన పోస్టర్లు ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పాయి. ఇక షూటింగ్ ముగింపు దశలో ఉండగా, స్పెషల్ సాంగ్ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. ఆ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కంపోజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. మిగిలిన చిన్న చిన్న టాకీ పార్ట్, ఆ పాట పూర్తయిన తర్వాత సినిమా పూర్తిగా రెడీ అవుతుంది. మొత్తంగా చూస్తే ప్రతి చిన్న అప్డేట్‌ తో పెద్ది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. విడుదల తేదీపై స్పష్టత రాగానే హైప్ మరింత పెరుగుతుంది.