Begin typing your search above and press return to search.

పెద్ది.. ఫ్యాన్స్‌కి టెన్షన్, మేకర్స్‌కు ప్రెషర్..

కానీ యూనిట్ నుంచి వస్తున్న సమాచారం మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 30 రిలీజ్‌ను మిస్ కాకూడదనే పట్టుదలతో టీమ్ పని చేస్తోందని తెలుస్తోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   20 March 2026 3:16 PM IST
పెద్ది.. ఫ్యాన్స్‌కి టెన్షన్, మేకర్స్‌కు ప్రెషర్..
X

సినీ ఇండ‌స్ట్రీలో ఇటీవల ఒక స్పష్టమైన ట్రెండ్ కనిపిస్తోంది. రిలీజ్ డేట్లు ముందే అనౌన్స్ చేసి, ఆఖ‌రి నిమిషంలో వాయిదా వేయడం. భారీ బడ్జెట్ సినిమాలే కాకుండా మిడ్‌రేంజ్ ప్రాజెక్ట్స్ కూడా ఇదే బాట పట్టడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో రామ్ చ‌ర‌ణ్ హీరోగా, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై కూడా ఇలాంటి పుకార్లు రావడం సహజంగానే ఫ్యాన్స్‌లో టెన్షన్‌ను పెంచింది.

మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి వాయిదా ప‌డ్డ పెద్ది

ముందుగా మార్చి 27న విడుదల కావాల్సిన ఈ సినిమా, కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ 30కి వాయిదా పడింది. అయితే ఇప్పుడు మళ్లీ మే లేదా జూన్‌కు షిఫ్ట్ అవుతుందన్న వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవ్వడం, ఇండస్ట్రీలో నెలకొన్న ఈ పోస్ట్‌పోన్ కల్చర్ ప్రభావమేనని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో కూడా అనేక సినిమాలు ఇదే విధంగా చివరి దశలో డేట్లు మార్చుకోవడం చూసిన ప్రేక్షకులు, పెద్ది విషయంలో కూడా అదే జరుగుతుందేమోనన్న అనుమానంతో ఉన్నారు.

టార్గెట్ మిస్ అయ్యేదేలే!

కానీ యూనిట్ నుంచి వస్తున్న సమాచారం మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 30 రిలీజ్‌ను మిస్ కాకూడదనే పట్టుదలతో టీమ్ పని చేస్తోందని తెలుస్తోంది. బ్యాలన్స్ షూటింగ్‌ను డే, నైట్ షెడ్యూల్స్‌లో పూర్తి చేస్తున్నారు. ఒక స్పెషల్ సాంగ్ మినహా మెయిన్ షూటింగ్ మొత్తం దాదాపు ముగింపు దశకు చేరుకున్న‌ట్టు స‌మాచారం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్స్ కూడా సమాంతరంగా జెట్ స్పీడ్‌లో కొనసాగుతున్నాయి. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్ రెహ‌మాన్ ఇప్పటికే ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్ ను పూర్తి చేయగా, రంజాన్ తరువాత సెకండాఫ్ పై వ‌ర్క్ చేయ‌నున్న‌ట్టు సమాచారం.

పెద్దిపై భారీ అంచ‌నాలు

ఇది మొత్తం చూస్తే, ఓవైపు ఇండస్ట్రీలో పెరుగుతున్న వాయిదాల ట్రెండ్, మరోవైపు పెద్ది టీమ్‌పై ఉన్న భారీ ఒత్తిడి.. ఈ రెండింటి మధ్య సమతౌల్యం సాధించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. భారీ బిజినెస్, సినిమాపై పెరిగిన అంచనాలు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఉన్న ప్రెషర్.. అన్నీ కలిసి పెద్ది సినిమాను టైమ్‌లైన్ విషయంలో మరింత కఠినంగా మార్చాయి. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ వంటి బ్యాన‌ర్లు కూడా సినీ నిర్మాణంలో భాగస్వామ్యం అవ‌డం వల్ల ప్లానింగ్‌లో ఎలాంటి లోపం లేకుండా ముందుకు తీసుకెళ్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.

ఇక ఫ్యాన్స్ విషయానికి వస్తే.. సోషల్ మీడియాలో ప్రతి చిన్న అప్‌డేట్‌నే పెద్ద చర్చగా మార్చే పరిస్థితి ఉంది. వాయిదా పుకార్లు వస్తే వెంటనే ఆందోళన, రిలీజ్ క్లారిటీ వస్తే ఉపశమనం..ఇలా ఎమోష‌న్స్ ఊచకోత కొనసాగుతోంది. ఇప్పటికే పెద్ది నుంచి వ‌చ్చిన రెండు సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో, మూడో సాంగ్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెద్ది మూవీ ఈ పుకార్లను అధిగమించి అనౌన్స్ చేసిన డేట్‌కే రిలీజైతే, అది కేవలం ఒక సినిమా స‌క్సెస్‌ మాత్రమే కాదు.. ప్రస్తుత ఇండస్ట్రీ ట్రెండ్‌కు ఒక బలమైన సమాధానంగా నిలుస్తుంది.