Begin typing your search above and press return to search.

పెద్దిపై మ‌ళ్లీ ఈ ట్విస్టేంటయ్యా చ‌ర‌ణూ..

ఈ వేస‌వికి తెలుగు నుంచి షెడ్యూల్ అయిన ఏకైక పెద్ద సినిమా పెద్ది మ‌రోసారి వాయిదా ప‌డ‌బోతోంద‌ని అంద‌రూ ఒక అభిప్రాయానికి వ‌చ్చేశారు.

By:  Garuda Media   |   2 April 2026 10:17 AM IST
పెద్దిపై మ‌ళ్లీ ఈ ట్విస్టేంటయ్యా చ‌ర‌ణూ..
X

ఈ వేస‌వికి తెలుగు నుంచి షెడ్యూల్ అయిన ఏకైక పెద్ద సినిమా పెద్ది మ‌రోసారి వాయిదా ప‌డ‌బోతోంద‌ని అంద‌రూ ఒక అభిప్రాయానికి వ‌చ్చేశారు. గ‌త నాలుగైదు రోజులుగా మీడియాలో, సోష‌ల్ మీడియాలో దీని గురించి జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. చిత్ర బృందం కూడా ఈ వార్త‌లను ఖండించ‌డం లేదు. అస‌లు వాయిదా గురించి లీక్స్ ఇచ్చిందే పెద్ది టీం అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముందుగా జ‌నాల‌ను ప్రిపేర్ చేసి.. త‌ర్వాత కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. జూన్ 25 లేదా 26 అంటూ కొత్త రిలీజ్ డేట్ ప్ర‌చారంలోకి వ‌చ్చింది కూడా. షూటింగ్‌తో పాటు సీజీ వ‌ర్క్ ఆల‌స్యం వ‌ల్లే పెద్ది వాయిదా ప‌డ‌బోతోంద‌ని అంటున్నారు. ఇలా అంద‌రూ వాయిదాకు సిద్ధ‌మైపోగా.. హీరో రామ్ చ‌ర‌ణ్ మాత్రం అలాంటిదేమీ లేదంటూ వ్యాఖ్యానించ‌డం పెద్ద షాక్.

త‌న చెల్లెలు నిహారిక కొణిదెల నిర్మించిన రాకాస సినిమాను ప్ర‌మోట్ చేయ‌డానికి రామ్ చ‌ర‌ణ్ ముందుకు వ‌చ్చాడు. రాకాస టీం అంతా వెళ్లి చ‌ర‌ణ్‌ను క‌లిసింది. ఆ సంద‌ర్భంగా జ‌రిగిన చిట్‌చాట్‌కు సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో పంచుకుంది చిత్ర బృందం. అందులో చర‌ణ్ పెద్ది గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌న‌ సినిమా ఆల‌స్యం అవుతోంద‌ని బ‌య‌ట బాగా వింటున్నాన‌ని.. అదేమీ లేద‌ని ప్ర‌మోట్ చేయ‌మ‌ని రాకాస టీం స‌భ్యుల‌కు చెప్పాడు. ఏప్రిల్ 30న పెద్ది వ‌చ్చే అవ‌కాశ‌మే లేద‌ని అంద‌రూ ఫిక్స్ అయి ఉంటే.. వేరే సినిమాలు మే 1కి షెడ్యూల్ అవుతుంటే మ‌ళ్లీ ఈ కొత్త ట్విస్ట్ ఏంటి అంటూ అంద‌రూ షాక‌వుతున్నారు. నిజంగా చ‌ర‌ణ్ చెప్పిన‌ట్లు పెద్ది ఆల‌స్యం కావ‌ట్లేదా.. ఇంత‌కుముందు చెప్పిన‌ట్లే ఏప్రిల్ 30న వ‌చ్చేస్తుందా అని ప్ర‌శ్నిస్తున్నారు. ఐతే చ‌ర‌ణ్ ఇలా అన్నా స‌రే.. పెద్ది ఈ నెల 30న రాద‌న్న‌దే రెండు రోజుల ముందు వ‌ర‌కు యూనిట్ వ‌ర్గాల నుంచి అందిన‌ స‌మాచారం. మ‌రి చివ‌రి రెండు రోజుల్లో ఏమైనా ప్ర‌ణాళిక‌లు మారిపోయి.. నిజంగా ఏప్రిల్ 30న ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి దిగుతుందేమో చూడాలి.