Begin typing your search above and press return to search.

చరణ్ 'పెద్ది'.. అప్పుడే 30 కోట్ల మంది..

ఇప్పుడు ఆ రెండు పాటలు కలిపి సూపర్ రికార్డు క్రియేట్ చేశాయి. చికిరి చికిరి, రాయ్ రాయ్ రా రా సాంగ్స్ కలిసి మొత్తం 300 మిలియన్లకు పైగా (30 కోట్లకు పైగా) వ్యూస్ సాధించాయి.

By:  M Prashanth   |   7 March 2026 10:13 PM IST
చరణ్ పెద్ది.. అప్పుడే 30 కోట్ల మంది..
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది విడుదలకు రెడీ అవుతోంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఆ యాక్షన్ డ్రామాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యేందుకు సిద్ధమవుతుండగా.. ఇప్పటికే ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు మేకర్స్. విడుదలైన ప్రతి అప్డేట్‌ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్‌, పోస్టర్లు, పాటలు సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ల్యాంగ్ గ్యాప్ తర్వాత ఆయన ఒక భారీ తెలుగు ప్రాజెక్ట్‌ కు సంగీతం అందించడం కూడా అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.

మేకర్స్ సినిమా నుంచి మొదటగా మెలోడీ సాంగ్ చికిరి చికిరి.. ను విడుదల చేశారు. మంచి కంపోజిషన్ తో.. హృదయాన్ని హత్తుకునే ట్యూన్ తో వచ్చిన ఆ పాట.. మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంది. అన్ని మ్యూజిక్ ప్లాట్‌ ఫామ్స్ లో చికిరి చికిరి సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభించింది. సోషల్ మీడియాలో కూడా పాట ఫుల్ గా షేర్ అవుతూ ట్రెండ్ అయింది.

ఆ తర్వాత రీసెంట్ గా విడుదలైన రెండో పాట రాయ్ రాయ్ రా రా ఫుల్ ఎనర్జీ సాంగ్ గా సందడి చేస్తోంది. జోష్ నింపే బీట్‌, ఆకట్టుకునే రిథమ్‌ తో ఆ పాట ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా సాంగ్ లోని డ్యాన్స్ స్టెప్స్‌, విజువల్ ప్రెజెంటేషన్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. విడుదలైన కొద్దిసేపటికే ఆ పాట కూడా నెట్టింట ట్రెండ్ అవుతూ భారీ వ్యూస్ సాధించింది.

ఇప్పుడు ఆ రెండు పాటలు కలిపి సూపర్ రికార్డు క్రియేట్ చేశాయి. చికిరి చికిరి, రాయ్ రాయ్ రా రా సాంగ్స్ కలిసి మొత్తం 300 మిలియన్లకు పైగా (30 కోట్లకు పైగా) వ్యూస్ సాధించాయి. దీంతో సినిమా విడుదలకు ముందే ఆ రేంజ్ లో వచ్చిన రెస్పాన్స్.. మేకర్స్ లో జోష్ నింపింది. రెండు పాటలు కంప్లీట్ వేర్వేరు మూడ్‌ లతో వచ్చినప్పటికీ, రెండూ కూడా చార్ట్‌ బస్టర్‌ లుగా నిలవడం విశేషం. ఇప్పుడు మిగిలిన పాటలపై కూడా అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.

అదే సమయంలో సినిమాలో రామ్ చరణ్ కంప్లీట్ కొత్త లుక్ లో కనిపించబోతున్నారని సమాచారం. గ్రామీణ నేపథ్యంతో పాటు యాక్షన్ అంశాలతో సినిమా రూపొందుతోందని టాక్ వినిపిస్తోంది. దర్శకుడు కథను చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారని ప్రచారం జరుగుతోంది. స్టార్ క్యాస్టింగ్ అండ్ టాలెంటెడ్ టెక్నీషియన్ టీమ్ తో తెరకెక్కుతున్న పెద్దిపై విడుదలకు ముందే సాంగ్స్ తో భారీ బజ్ క్రియేట్ అయింది. మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి. .