Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ మెగా ప్రమోషనల్ రూట్ మ్యాప్!

పాన్-ఇండియా సినిమా తీయ‌డం గొప్ప‌కాదు. తీసిన ఆ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల‌కు రీచ్ చేయ‌డం అన్న‌ది అతి పెద్ద విష‌యం.

By:  Srikanth Kontham   |   26 May 2026 11:39 PM IST
రామ్ చరణ్ మెగా ప్రమోషనల్ రూట్ మ్యాప్!
X

పాన్-ఇండియా సినిమా తీయ‌డం గొప్ప‌కాదు. తీసిన ఆ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల‌కు రీచ్ చేయ‌డం అన్న‌ది అతి పెద్ద విష‌యం. ఈనేప‌థ్యంలో ఎలాంటి ప్రమోష‌న్ స్ట్రాట‌జీతో ముందుకెళ్తున్నాం అన్న‌ది అత్యంత కీల‌కం. టాలీవుడ్ నుంచి గ్లోబల్ స్థాయికి ఎదిగిన మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ `పెద్ది `విడుదల సందర్భంగా ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించే లక్ష్యంతో? మునుపెన్నడూ లేని విధంగా విలక్షణమైన, భారీ ప్రమోషనల్ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకుని అల్-ఇండియా టూర్‌లో బిజీగా గడుపుతున్నారు. మెగా ప్రమోషనల్ క్యాంపెయిన్ కొన్ని నగరాలకే పరిమితం కాకుండా దేశమంతటా నెల రోజులకు పైగా విస్తృతంగా పర్యటించేలా వ్యూహాత్మకంగా ప్లాన్ చేశారు.

ఒకవైపు దర్శకుడు బుచ్చిబాబు తెరవెనుక ఉండి మేకింగ్ - పోస్ట్-ప్రొడక్షన్ పనులను, ప్రమోషన్ల రూపకల్పనలో బిజీగా ఉంటే? మరోవైపు రామ్ చరణ్ ఫ్రంట్ లైన్‌లో ఉండి దేశంలోని ప్రధాన నగరాలను చుట్టేస్తున్నారు. ఈ విధమైన సమన్వయ వ్యూహం సినిమాపై అంచనాలను అంత‌కంత‌కు పెంచేస్తోంది. ఇప్పటికే ముంబై నగరంలో నిర్వహించిన గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడమే కాదు. సినిమా రేంజ్‌ను బాలీవుడ్ హార్ట్‌ల్యాండ్‌లో బలంగా చాటిచెప్పింది. అటుపై హిందీ బెల్ట్ మార్కెట్‌ను మరింత ప్రభావితం చేసేలా భోపాల్‌లో నిర్వహించిన భారీ మ్యూజికల్ ఈవెంట్ విజయవంతంగా ముగిసింది.

ఉత్తరాది పర్యటనలు సినిమాకు ప్రాంతీయ పరిమితులు కాకుండా నేషనల్ వైడ్ రీచ్‌ను తెచ్చిపెట్టడంలో సక్సెస్ అయ్యాయి. తాజాగా బెంగళూరులో జరిగిన మెగా ఈవెంట్ కన్నడ నాట సంచలనంగా మారింది. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ ,చిత్ర కథానాయిక జాన్వీ కపూర్‌లతో కలిసి రామ్ చరణ్ ఈ వేదికపై సందడి చేశారు. పొరుగు రాష్ట్రాల స్టార్ హీరోలు , మేకర్స్‌తో ఉన్న ఆత్మీయ బంధాన్ని ఈ వేదిక ద్వారా చాటి చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో సినిమా థియేట్రికల్ మార్కెట్‌ను పటిష్టం చేసుకునేలా ఈ కార్యక్రమం సాగింది.

మే 28న దేశ రాజధాని ఢిల్లీలో స్పెషల్ మీడియా ఈవెంట్ జరగనుంది. ఆ వెంటనే మే 30న కోలీవుడ్ హబ్ అయిన చెన్నై మహానగరంలో యూనిట్ ప్రమోషన్లను నిర్వహించనుంది. ఇలా ప్రతి భాషా మార్కె ట్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఆయా నగరాల నేటివిటీకి తగినట్లుగా ఈవెంట్లను డిజైన్ చేయడం రూట్ మ్యాప్ ఉద్దేశంగా కనిపిస్తోంది. చివ‌రిగా తెలుగు రాష్ట్రాల‌ ప్ర‌మోష‌న్ తో టూర్ ముగిస్తుంది. జూన్ 1న విజయనగరంలో భారీ పబ్లిక్ ఈవెంట్ ఆ మరుసటి రోజైన జూన్ 2న హైదరాబాద్‌లో గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌తో టూర్ ముగుస్తుంది. ఈ విధంగా దేశంలోని అన్ని ప్రధాన కేంద్రాలను కవర్ చేస్తూ రామ్ చరణ్ ప్లాన్ చేసిన ప్రమోషనల్ రూట్ మ్యాప్ రాబోయే రోజుల్లో పాన్-ఇండియా సినిమాల మార్కెటింగ్ వ్యూహాలకు సరికొత్త బెంచ్‌మార్క్‌గా నిలవడం ఖాయం.