చరణ్ యాక్టింగ్ చూసి గర్వపడుతున్నా.. చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 24 Jun 2026 9:28 AM ISTరామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకున్న విషయం తెలిసిందే. సినిమాకు వచ్చిన కలెక్షన్స్ పై మేకర్స్ చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కోసం పెద్ది మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఒక సీనియర్ యాక్టర్ గా, సినిమాను ఇష్టపడే వ్యక్తిగా ఈ ఈవెంట్ కు వచ్చినట్లు చిరు చెప్పారు. ఫ్యాన్స్ చూపిస్తున్న సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మూవీ టీమ్ కు కంగ్రాట్స్ చెప్పారు.
ఇండస్ట్రీ బాగుండాలంటే థియేటర్ల దగ్గర సందడి తెచ్చే ఇలాంటి సినిమాలు చాలా అవసరం అని చిరు అన్నారు. సినిమా చూస్తున్నంత సేపు తానొక కొత్త ఫీలింగ్ లోకి వెళ్లిపోయానని, ఆ క్యారెక్టర్ల జర్నీలో తానూ కలిసిపోయానని చెప్పారు. ఒక ఎమోషనల్ స్టోరీని తీసుకుని దానికి చరణ్ న్యాయం చేస్తాడని నమ్మిన డైరెక్టర్ బుచ్చిబాబును మెచ్చుకున్నారు. బుచ్చిబాబుకు పల్లెటూరి బ్యాక్ గ్రౌండ్ ఉండటం వల్లే ఆ ఎమోషన్స్ ను అంత నాచురల్ గా తీశాడని అన్నారు.
చరణ్ యాక్టింగ్ గురించి చెబుతూ ఒక తండ్రిగా తాను ఫుల్ ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నట్లు చిరంజీవి చెప్పారు. రంగస్థలం తర్వాత మళ్లీ అలాంటి క్యారెక్టర్ రావడం చరణ్ లక్ అని అన్నారు. సినిమా చూస్తున్నప్పుడు తనకు తెరపై రామ్ చరణ్ కనిపించలేదని, కేవలం పెద్ది మాత్రమే కనిపించాడని ఫీల్ అయ్యారు. ఆడియన్స్ కు అన్ని రకాల ఎమోషన్స్ కనెక్ట్ చేయడంలో చరణ్ పక్కాగా సక్సెస్ అయ్యాడని చెప్పారు.
ఒక స్టార్ హీరో కొడుకుగా పుట్టినా ఈ సినిమా కోసం చరణ్ పడిన కష్టాన్ని తాను దగ్గరుండి చూశానని చిరు చెప్పారు. ఉదయం సాయంత్రం వర్కవుట్స్ చేస్తూ బాడీ మార్చుకున్న తీరు తనను ఆశ్చర్యపరిచిందన్నారు. షూటింగ్ లో చరణ్ కంటికి దెబ్బ తగిలి ఎనిమిది కుట్లు పడ్డాయని చెప్పారు. ఒకప్పుడు తాను రిస్క్ చేసినప్పుడు తన తండ్రి పడిన టెన్షన్.. ఇప్పుడు చరణ్ కష్టపడుతుంటే తనకు అర్థమవుతోందని ఎమోషనల్ అయ్యారు.
ప్రధాని మోదీ రామ్ చరణ్ ను న్యూ ఏజ్ మెగాస్టార్ అని పిలవడం తనకు ఎంతో హ్యాపీగా అనిపించిందని చిరంజీవి చెప్పారు. పిల్లలు సక్సెస్ అవుతుంటే ఒక తండ్రికి వచ్చే ఆనందాన్ని తాను ఇప్పుడు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇంతటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆడియన్స్ కు థాంక్స్ చెబుతూ డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ తో పాటు టీమ్ అందరి వర్క్ ను ఆయన అప్రిషియేట్ చేశారు.
