ఓవర్సీస్ ట్రెండ్స్.. ఇది కదా 'పెద్ది' రేంజ్ అంటే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైనట్లే.
By: M Prashanth | 22 May 2026 10:45 AM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైనట్లే. సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజులే సమయం ఉండగా, ఇప్పటికే ఓవర్సీస్ మార్కెట్ లో ఆ మూవీ భారీ హైప్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా యూకే, నార్త్ అమెరికా ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే పెద్ది రేంజ్ ఏంటో క్లియర్ గా అర్థమవుతోంది.
తాజాగా విడుదలైన అఫీషియల్ పోస్టర్ల ప్రకారం, యూకే ప్రీమియర్స్ కు ఇప్పటికే 7500కి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. అలాగే నార్త్ అమెరికా ప్రీమియర్స్ కు 15 వేలకుపైగా టికెట్లు సేల్ అయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇంకా బుకింగ్స్ కొనసాగుతుండటంతో ఆ కౌంట్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ 3న గ్రాండ్ ప్రీమియర్స్ కు ప్లాన్ చేసిన ఆ సినిమాపై ఓవర్సీస్ ఆడియన్స్ లో మంచి ఆసక్తి కనిపిస్తోంది.
ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు, పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు తీసుకొచ్చాయి. ముఖ్యంగా రామ్ చరణ్ ను సినిమాలో కంప్లీట్ గా కొత్త లుక్ లో చూపించడం అభిమానులను ఆకట్టుకుంది. మాస్ యాక్షన్ తో పాటు గ్రామీణ భావోద్వేగాలను కలిపిన కథగా ఆ చిత్రం రూపొందుతోందని తెలుస్తోంది. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ప్రేక్షకుల్లో కూడా సినిమాపై ఆసక్తి నెలకొంది.
పెద్ది కథ 1980ల గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఒక యువకుడు స్పోర్ట్స్ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ తో తన ఊరిని ఏకం చేసే జర్నీనే సినిమా ప్రధానాంశంగా ఉంటుందని టాక్. స్పోర్ట్స్ డ్రామా ఎలిమెంట్స్ తో పాటు స్ట్రాంగ్ ఎమోషనల్ టచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు తన గత చిత్రం ఉప్పెనలో చూపించిన భావోద్వేగాలను పెద్దిలో మరింత భారీ రేంజ్ లో ప్రెజెంట్ చేయబోతున్నారని వినికిడి.
ఇక చరణ్ కెరీర్ లో పెద్ది మరో కీలక చిత్రం కానుందనే అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్థాయిలో రామ్ చరణ్ కు ఏర్పడిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ పెద్దిని భారీ స్థాయిలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఓవర్సీస్ లో కూడా అదే ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ప్రీమియర్స్ తో భారీ ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం సినిమాపై మరింత అంచనాలు పెంచుతోంది. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. జూన్ 4న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న పెద్ది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. అయితే ఓవర్సీస్ బుకింగ్స్ ట్రెండ్స్ మాత్రం సినిమా కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో స్పష్టం చేస్తున్నాయి.
