రామ్ చరణ్ 'పెద్ది'.. బీటౌన్ పై సీరియస్ గా ఫోకస్ చేశారా?
అయితే ఈసారి పెద్ది టీమ్ సాధారణ ప్రమోషన్లతో ఆగిపోవడం లేదు. నార్త్ ఇండియా ప్రేక్షకులను గట్టిగా ఆకట్టుకునేలా స్పెషల్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తోందని సమాచారం.
By: M Prashanth | 14 May 2026 1:00 AM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పెద్దిపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఆ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటికే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారగా.. ఇప్పుడు మూవీ టీమ్ ఫోకస్ మొత్తం నార్త్ ఇండియా మార్కెట్ పై పడినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ భారీ ప్రమోషన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే విడుదలైన రామ్ చరణ్ పహిల్వాన్ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఆ సినిమాలో చరణ్ మాస్ అవతార్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. రెండు సార్లు వాయిదా పడిన తర్వాత ఆ సినిమాను జూన్ 4న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక మే 18న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన రావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
అయితే ఈసారి పెద్ది టీమ్ సాధారణ ప్రమోషన్లతో ఆగిపోవడం లేదు. నార్త్ ఇండియా ప్రేక్షకులను గట్టిగా ఆకట్టుకునేలా స్పెషల్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తోందని సమాచారం. ముఖ్యంగా ఆ సినిమా నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ను జియో స్టూడియోస్ దక్కించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. హిందీతో పాటు తెలుగు వెర్షన్ హక్కులూ జియో స్టూడియోస్ తీసుకోవడం విశేషం.
బాలీవుడ్ మార్కెట్ లో భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేయడానికి జియో స్టూడియోస్ సిద్ధమవుతోందని తెలుస్తోంది. అందుకే ట్రైలర్ లాంచ్ ను కూడా ముంబైలో గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు.. ట్రైలర్ ఈవెంట్ తర్వాత భోపాల్ లో భారీ మ్యూజికల్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే పెద్దిని కేవలం సౌత్ మూవీగా కాకుండా నిజమైన పాన్ ఇండియా బ్రాండ్ గా నిలబెట్టాలని టీమ్ భావిస్తున్నట్లు అర్థమవుతోంది.
ఎందుకంటే పెద్ది భారీ బడ్జెట్ మూవీ కనుక.. నార్త్ వసూళ్లు చాలా కీలకం. ముఖ్యంగా ఓపెనింగ్స్ పెద్ద ఎత్తున ఉంటే.. సినిమాకు బాగా కలిసి వస్తుంది. అందుకే మేకర్స్ బీటౌన్ పై సీరియస్ గా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూ.163 కోట్లకు సేల్ అయినట్లు తెలుస్తుండగా.. ఈజీగా రికవరీ అవుతుందని భావిస్తున్నారట. అందుకే నార్త్ పై ఎక్కువ దృష్టి పెట్టారని టాక్.
ఇక సినిమా క్యాస్టింగ్ కూడా నార్త్ మార్కెట్ లో కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బొమన్ ఇరానీ, దివ్యేందు వంటి నటులు ఉండటం హిందీ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆస్కార్ విజేత రెహమాన్ సంగీతం అందిస్తుండటం సినిమాకు మరో ప్లస్ గా మారింది. ఏదేమైనా పెద్ది విషయంలో మూవీ టీమ్ చాలా ప్లాన్డ్ గా ముందుకెళ్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నార్త్ మార్కెట్ పై ప్రత్యేక దృష్టి పెట్టడం.. ముంబైలో ప్రమోషన్స్ ప్లాన్ చేయడం.. జియో స్టూడియోస్ భాగస్వామ్యం కావడం చూస్తుంటే.. ఈసారి చరణ్ బాలీవుడ్ బాక్సాఫీస్ పైనా గట్టిగానే ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.
