పెద్ది హవా.. జెట్ స్పీడ్లో మిలియన్ రికార్డ్
రామ్ చరణ్ సినిమా 'పెద్ది' నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్స్ తో సాలిడ్ నంబర్స్ నమోదు చేస్తోంది.
By: M Prashanth | 3 Jun 2026 10:42 AM ISTరామ్ చరణ్ సినిమా 'పెద్ది' నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్స్ తో సాలిడ్ నంబర్స్ నమోదు చేస్తోంది. మరికొన్ని గంటల్లో అక్కడ ప్రీమియర్స్ పడబోతున్నాయి. రిలీజ్ కు ముందే ఈ సినిమా ప్రీ సేల్స్ 1.1 మిలియన్ డాలర్ల మార్క్ దాటేయడం విశేషం. ప్రత్యంగిర సినిమాస్ సంస్థ ఓవర్సీస్ లో ఈ చిత్రాన్ని భారీ స్క్రీన్స్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న టికెట్ బుకింగ్స్ ట్రెండ్ గమనిస్తే ప్రీమియర్స్ సమయానికి ఈ లెక్క మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
మొదటి రోజే మిలియన్ మార్క్ దాటింది అంటే బజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దర్శకుడు బుచ్చిబాబు సనా ఈ కథను ఏ తరహాలో తెరకెక్కించాడనే క్యూరియసిటీ ప్రేక్షకుల్లో బలంగా ఉంది. ఉప్పెన తర్వాత అతడు చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో స్క్రిప్ట్ లో మంచి డెప్త్ ఉంటుందని భావిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించడం, ఏఆర్ రెహమాన్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ పని చేయడం ఈ ప్రాజెక్ట్ కు అదనపు బలాన్ని ఇచ్చాయి.
నార్త్ అమెరికాలో తెలుగు సినిమాలకు ప్రీమియర్స్ ద్వారానే అసలైన ఓపెనింగ్స్ వస్తాయి. పెద్ది మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ లో 1.1 మిలియన్ డాలర్లు దాటడం పాజిటివ్ సైన్ అయినా, పూర్తి లాభాల్లోకి వెళ్లాలంటే ఈ ఊపు ఫుల్ రన్ లో కంటిన్యూ అవ్వాలి. ఓవర్సీస్ లో ఈ చిత్రానికి జరిగిన థియేట్రికల్ బిజినెస్ దృష్ట్యా, బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఒక భారీ టార్గెట్ నే ముందు పెట్టుకున్నారు.
కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ మీద ఆధారపడకుండా, ఆ మొదటి ప్రీమియర్ షోల తర్వాత వచ్చే మౌత్ టాక్ ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ను డిసైడ్ చేస్తుంది. కేవలం స్టార్ హీరో సినిమా కావడంతో బజ్ రావడం సహజమే. కానీ అసలు రిజల్ట్ అనేది దర్శకుడు రాసుకున్న ఎమోషన్స్ ఎంతవరకు కనెక్ట్ అయ్యాయి అనే అంశం మీదే ఆధారపడి ఉంటుంది. పాన్ ఇండియా అప్పీల్ తో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో చరణ్ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
రత్నవేలు కెమెరా వర్క్ ఈ చిత్రానికి మరో హైలైట్ గా నిలవనుంది. సాంకేతికంగా ఎంతో రిచ్ గా తీర్చిదిద్దిన ఈ సినిమాలో కంటెంట్ ఆడియన్స్ కు బలంగా చేరితే నార్త్ అమెరికాలో కలెక్షన్స్ జోరు ఏమాత్రం తగ్గకుండా లాంగ్ రన్ వరకు సాగుతుంది. ఇక రాత్రి పడే ప్రీమియర్ షోల కోసం ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ వర్గాలు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తొలి రోజు వచ్చే టాక్ పాజిటివ్ గా ఉంటే ఓవర్సీస్ లో పెద్ది సులభంగానే రికార్డు వసూళ్లు సాధించే ఛాన్స్ ఉంది. ప్రమోషన్స్ ద్వారా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేయడంలో చిత్ర బృందం సక్సెస్ అయింది, ఇక థియేటర్లలో బొమ్మ మాట్లాడాల్సి ఉంది. మరి ఈ చిత్రం ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.
