పెద్ది డే అండ్ నైట్ ఆట షురూ..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చి బాబు కాంబోలో వస్తున్న పెద్ది మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
By: Ramesh Boddu | 30 July 2025 2:00 AM ISTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చి బాబు కాంబోలో వస్తున్న పెద్ది మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పెద్ది సినిమా ఫస్ట్ షాట్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించాడు డైరెక్టర్ బుచ్చిబాబు. జస్ట్ టీజర్ తోనే సినిమాపై సూపర్ హైప్ ఇచ్చేశారంటూ మెగా ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ అయ్యారు. ఐతే పెద్ది సినిమా మొత్తం కథ కథనాలు ఎంత పకడ్బందీగా ఉంటాయో హీరో ఎలివేషన్ కూడా అదే రేంజ్ లో ఉంటుందట.
చరణ్ ఫుల్ ఎఫర్ట్స్..
ఫస్ట్ షాట్ తో ఎలాగైతే బ్లాస్ట్ అయ్యిందో.. ఈ సినిమా రికార్డుల మోత కూడా మోగిపోతుందట. పెద్ది సినిమా కోసం చరణ్ తన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేస్తున్నాడు. సినిమా ప్రస్తుతం నైట్ షూట్స్ జరుపుకుంటుందట. RFCలో ఈ నైట్ షూట్ జరుగుతుందట. రామ్ చరణ్ రాత్రంతా షూటింగ్ లో రెస్ట్ లెస్ గా కష్టపడుతున్నాడట. సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు చరణ్.
ఈ నైట్ షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సీన్స్ తో పాటుగా ఒక సాంగ్ షూట్ చేస్తున్నారట. జాన్వి కపూర్ తో కలిసి చరణ్ సాంగ్ షూట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పెద్ది సినిమాకు ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లాన్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటున్నాయి. మెగా ఫ్యాన్స్ కే కాదు కామన్ ఆడియన్స్ కి కూడా సినిమా బాగా ఎక్కేలా ప్లాన్ చేస్తున్నారట.
విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో..
పెద్ది తో చరణ్ ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. సినిమా విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది. ఐతే సినిమాలో చరణ్ క్యారెక్టరైజేషన్స్ లో వేరియేషన్స్ ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ ఇస్తాయని అంటున్నారు. పెద్ది మూవీ పై రోజు రోజుకి బజ్ పెరిగిపోతుంది. తప్పకుండా చరణ్ మంచి కంబ్యాక్ ఇచ్చే సినిమాగా ఇది అవుతుందని అంటున్నారు.
RRR తర్వాత ఆచార్య ఫెయిల్ అవగా.. గేమ్ ఛేంజర్ భారీ డిజాస్టర్ అయ్యింది. అందుకే పెద్ది సినిమా కోసం చరణ్ రెస్ట్ లెస్ గా కష్టపడుతున్నాడు. మరి పెద్ది చరణ్ కోరుకునే హిట్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. చరణ్ ఆట పాటే కాదు జాన్వి గ్లామర్, రెహమాన్ మ్యూజిక్ కూడా సినిమాకు హైలెట్ అయ్యేలా చేస్తున్నారట. 2026 మార్చి 28న పెద్ది మూవీ రిలీజ్ ప్లాన్ చేశారు.
