Begin typing your search above and press return to search.

ఆ గ్యాప్ ను క‌వ‌ర్ చేయాల‌నుకుంటున్న చ‌ర‌ణ్

అయితే అంతా అయిపోయాక చేసేదేమీ లేక చ‌ర‌ణ్ త‌న ఫోక‌స్ ను త‌ర్వాతి సినిమాపైకి మార్చారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   10 Oct 2025 12:42 PM IST
ఆ గ్యాప్ ను క‌వ‌ర్ చేయాల‌నుకుంటున్న చ‌ర‌ణ్
X

రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ తో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాతో అత‌నికి గ్లోబ‌ల్ స్థాయిలో గుర్తింపు ద‌క్కింది. ఆర్ఆర్ఆర్ పూర్త‌వ‌గానే పెద్ద‌గా గ్యాప్ తీసుకోకుండా వెంట‌నే స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గేమ్ ఛేంజ‌ర్ ను మొద‌లుపెట్ట‌డంతో ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల‌య్యారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం చాలా స‌మ‌యాన్ని కేటాయించిన చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ ను ఫాస్ట్ గా ఫినిష్ చేయాల‌నుకున్నారు.

డిజప్పాయింట్ చేసిన గేమ్ ఛేంజ‌ర్

కానీ అనుకోని కార‌ణాల వ‌ల్ల గేమ్ ఛేంజ‌ర్ సినిమా పూర్త‌వడానికి చాలానే టైమ్ ప‌ట్టింది. వాయిదాల మీద వాయిదాలు ప‌డి ఆ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఎంతో క‌ష్ట‌ప‌డి, ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న గేమ్ ఛేంజ‌ర్ సినిమా తీరా రిలీజ‌య్యాక చ‌ర‌ణ్ కు నిరాశే మిగిల్చింది. ఇలాంటి సినిమా కోస‌మా చ‌ర‌ణ్ ఇన్నాళ్లూ క‌ష్ట‌ప‌డింది అని అంద‌రూ మాట్లాడుకున్నారు.

చ‌ర‌ణ్ ఫోక‌స్ మొత్తం పెద్ది పైనే!

అయితే అంతా అయిపోయాక చేసేదేమీ లేక చ‌ర‌ణ్ త‌న ఫోక‌స్ ను త‌ర్వాతి సినిమాపైకి మార్చారు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ ఉప్పెన సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో పెద్ది అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుంది.

జ‌వ‌న‌రి వ‌ర‌కు పెద్దితోనే బిజీ

వ‌చ్చే ఏడాది మార్చి 27న పెద్ది సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, జ‌న‌వ‌రి నెలాఖ‌రు వ‌ర‌కు చ‌ర‌ణ్ ఈ సినిమా కోసం త‌న స‌మ‌యాన్ని కేటాయించిన‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పెద్ది త‌ర్వాత చ‌ర‌ణ్ త‌న నెక్ట్స్ మూవీని సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఆల్రెడీ చ‌ర‌ణ్- సుకుమార్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతుండ‌గా, ఈ మూవీ ఫిబ్ర‌వ‌రిలో మొద‌ల‌య్యే అవ‌కాశ‌మున్న‌ట్టు తెలుస్తోంది.

ఫిబ్ర‌వ‌రిలో సుకుమార్ తో సెట్స్‌పైకి

అంటే పెద్దిని పూర్తి చేసిన వెంట‌నే రామ్ చ‌ర‌ణ్, త‌న త‌ర్వాతి సినిమా కోసం వ‌ర్క్ చేయ‌నున్నార‌న్న‌మాట‌. ఆల్రెడీ ఆర్ఆర్ఆర్, గేమ్ ఛేంజ‌ర్ సినిమాల కోసం ఎక్కువ టైమ్ తీసుకోవ‌డం వ‌ల్ల సినిమాల‌ను వేగంగా పూర్తి చేయ‌లేక‌పోతున్నానని భావించిన చ‌ర‌ణ్, ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండానే త‌న త‌ర్వాతి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి గ‌తంలో వ‌చ్చిన గ్యాప్ ను పూరించాల‌నుకుంటున్నార‌ని అర్థ‌మ‌వుతుంది. ఇదిలా ఉంటే గ‌తంలో చ‌ర‌ణ్- సుకుమార్ కాంబోలో వ‌చ్చిన రంగ‌స్థ‌లం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌డంతో వీరిద్ద‌రి క‌ల‌యిలో రానున్న సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ మూవీ చ‌ర‌ణ్ కెరీర్లో 17వ సినిమాగా రూపొంద‌నుంది.