పెద్ది రచ్చ చేసే టైమొచ్చింది
కొన్నిసార్లు భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా ఫ్లాపవుతుంటాయి. అలా భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సినిమానే గేమ్ ఛేంజర్.
By: Madhu Reddy | 1 Nov 2025 6:00 PM ISTకొన్నిసార్లు భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా ఫ్లాపవుతుంటాయి. అలా భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సినిమానే గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడం మెగా ఫ్యాన్స్ ను చాలా తీవ్ర నిరాశకు గురి చేసింది. రిజల్ట్ ఏదైనా సరే మన చేతుల్లో లేదని తెలుసుకున్న చరణ్ తన ఫోకస్ మొత్తాన్ని తర్వాతి సినిమాపైకి మార్చేశారు.
పెద్దితో నెక్ట్స్ లెవెల్ కు వెళ్లాలని ప్లాన్
అందులో భాగంగానే చరణ్ తన నెక్ట్స్ మూవీని టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో చేస్తున్నారు. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న బుచ్చిబాబు తన రెండో సినిమాగా పెద్దిని చేస్తున్నారు. పెద్ది సినిమా కోసం చాలా కాలంపాటూ వెయిట్ చేసిన బుచ్చి, ఈ సినిమాతో డైరెక్టర్ గా నెక్ట్స్ లెవెల్ కు వెళ్లాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగానే పెద్ది కోసం ప్రతీదీ చాలా భారీగా ప్లాన్ చేస్తూ వస్తున్నారు.
పెద్ది కోసం రంగంలోకి పలువురు
హీరోయిన్ గా బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్ ను ఎంపిక చేసిన బుచ్చిబాబు, ఓ కీలక పాత్ర కోసం కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ ను తీసుకున్నారు. ఇక సంగీతం కోసం ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ను ఒప్పించడమే కాకుండా సెట్స్ పైకి వెళ్లకముందే పెద్ది కోసం నాలుగు ట్యూన్లను కంపోజ్ చేయించుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వినిపిస్తున్నాయి.
నవంబర్ 4నుంచి కొత్త షెడ్యూల్
పెద్ది నెక్ట్స్ షెడ్యూల్ నవంబర్ 4 నుంచి హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలవనుందని, ఈ షెడ్యూల్ షూటింగ్ కోసం చరణ్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు, రానున్న రెండు వారాల్లో పెద్దికి సంబంధించి రెండు కొత్త అప్డేట్స్ రానున్నాయని, ఆ అప్డేట్స్ కచ్ఛితంగా సోషల్ మీడియాను ఉర్రూతలూగించడం ఖాయమని చిత్ర యూనిట్ సభ్యులంటున్నారు. వచ్చే ఏడాది చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానున్న పెద్ది సినిమా నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్ రానుందని సమాచారం.
