Begin typing your search above and press return to search.

చరణ్ 'పెద్ది'.. మేకర్స్ నిర్ణయం కలిసొచ్చినట్లుందే..

ముఖ్యంగా ఓటీటీ కోసం కొన్ని కొత్త సీన్స్ యాడ్ చేయాలన్న మేకర్స్ నిర్ణయం సినిమాకు అట్రాక్షన్ గా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

By:  M Prashanth   |   16 July 2026 12:20 AM IST
చరణ్ పెద్ది.. మేకర్స్ నిర్ణయం కలిసొచ్చినట్లుందే..
X

థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న సినిమాలు ఓటీటీలో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ను అందుకోవడం రేర్. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత నెట్‌ ఫ్లిక్స్‌ లోకి వచ్చిన ఆ సినిమా, అక్కడ కూడా మంచి వ్యూయర్‌ షిప్‌ తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఓటీటీ కోసం కొన్ని కొత్త సీన్స్ యాడ్ చేయాలన్న మేకర్స్ నిర్ణయం సినిమాకు అట్రాక్షన్ గా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఆ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్టైనర్ థియేటర్లలో ఇప్పటికే భారీ వసూళ్లు సాధించి విజయాన్ని నమోదు చేసింది. ఆ సక్సెస్ కు కొనసాగింపుగా జూలై 9 నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. థియేటర్లలో చూసిన ప్రేక్షకులే మరోసారి ఓటీటీలో సినిమా చూడటం విశేషంగా మారింది.

దీనికి ప్రధాన కారణంగా ఓటీటీ వెర్షన్‌ లో యాడ్ చేసిన ఎక్స్ ట్రా సీన్స్ అని తెలుస్తోంది. థియేటర్లలో లేని కొన్ని ఎమోషనల్, డ్రామాటిక్ మూమెంట్స్‌ ను ఓటీటీ కట్‌ లో చేర్చడంతో ఇప్పటికే సినిమా చూసిన వారిలో కూడా మళ్లీ ఆసక్తి పెరిగింది. అదే సమయంలో థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఆ సినిమాను పెద్ద ఎత్తున చూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా పెద్దిపై పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది.

ముఖ్యంగా రామ్ చరణ్ నటన, పాత్రలోని భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాలపై మళ్లీ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కథను దర్శకుడు మలిచిన తీరు, ఓటీటీ వెర్షన్‌ లో కనిపించిన కొత్త సీన్స్ సినిమాపై చర్చను మరింత పెంచాయి. డిజిటల్ ప్లాట్‌ ఫామ్‌ లో తొలి వారంలోనే పెద్దికి సుమారు 1.9 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు సమాచారం. అదే సమయంలో భారత్‌ లో నెట్‌ ఫ్లిక్స్ ట్రెండింగ్ జాబితాలో టాప్ 10లో ఉండడం విశేషం.

మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. ప్రస్తుతం పెద్ది మూవీ సౌత్ లాంగ్వేజ్ లో మాత్రమే అందుబాటులో ఉండగా, హిందీ వెర్షన్ విడుదల కావాల్సి ఉంది. హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత వ్యూయర్‌ షిప్ మరింత పెరిగే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి. సినిమా థియేటర్లలో విజయవంతమైతే ఓటీటీలో కూడా అదే కట్‌ విడుదల చేయడం కామన్. కానీ పెద్ది విషయంలో మాత్రం ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ కలిగించేలా కొత్త సీన్స్ యాడ్ చేయడం మేకర్స్ తీసుకున్న తెలివైన నిర్ణయంగా కనిపిస్తోంది.

అదే ఇప్పుడు మరోసారి సినిమాపై ఆసక్తిని పెంచి, డిజిటల్ ప్లాట్ ఫామ్ పై కూడా మంచి రిజల్ట్స్ తీసుకొస్తోంది. ఇప్పటికే థియేటర్లలో సత్తా చాటిన పెద్ది.. ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరును కొనసాగిస్తోంది. రానున్న వారాల్లో ఆ సినిమా వ్యూయర్‌ షిప్ మరింత పెరిగి కొత్త రికార్డులు సృష్టిస్తుందా? లేదా అనే ఆసక్తి సినీ ప్రియుల్లో నెలకొంది. ప్రస్తుతం ట్రెండ్‌ చూస్తే.. మేకర్స్ తీసుకున్న చిన్న నిర్ణయం సినిమాకు మరో విజయాన్ని అందించినట్లే కనిపిస్తోంది.