Begin typing your search above and press return to search.

కలిసొచ్చిన 5 నిమిషాల సీన్.. ఓటీటీలో దుమ్ము దులిపేస్తున్న పెద్ది!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా.. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన భారీ చిత్రం ‘పెద్ది’.

By:  Madhu Reddy   |   10 July 2026 2:00 PM IST
కలిసొచ్చిన 5 నిమిషాల సీన్.. ఓటీటీలో దుమ్ము దులిపేస్తున్న పెద్ది!
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా.. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన భారీ చిత్రం ‘పెద్ది’. థియేటర్లలో భారీ వసూళ్లతో సాలిడ్ విజయాన్ని అందుకున్న ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా, ఇప్పుడు ఓటీటీలోనూ అదే రేంజ్ లో దుమ్ములేపుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే సౌత్ లాంగ్వేజెస్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ, ఇండియాలోనే టాప్-1 ట్రెండింగ్ మూవీగా నిలిచింది. డిజిటల్ స్క్రీన్‌పై కూడా మెగా పవర్ స్టార్ హవా చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆ వివరాలు చూద్దాం..

ఓటీటీలోనూ ‘పెద్ది’ ఊచకోత:

థియేటర్లలో మిస్ అయిన ఆడియన్స్‌తో పాటు, మరోసారి ఈ అద్భుతమైన ఎమోషనల్ జర్నీని ఎక్స్ పీరియన్స్ చేయాలనుకున్న ఫ్యాన్స్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. ఇక దీంతో ఓటీటీలోకి వచ్చిన మరుసటి రోజే నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్-10 ట్రెండింగ్ మూవీస్ లిస్టులో ‘పెద్ది’ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించిన చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి.

థియేటర్లలో లేని అదనపు సీన్స్ హైలైట్:

ఈ ఓటీటీ వెర్షన్‌లో ప్రేక్షకులకు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. థియేటర్లలో కట్ చేసిన కొన్ని అదనపు సన్నివేశాలను ఓటీటీ వెర్షన్‌లో జోడించారు. ఇక ఈ కొత్త సీన్స్ కథలోని ఎమోషన్స్‌ను మరింత పీక్స్‌కు తీసుకెళ్లాయని ముఖ్యంగా రామ్ చరణ్ క్యారెక్టర్‌కు ఇవి మరింత బలాన్ని చేకూర్చాయని సినిమా చూసిన నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

రామ్ చరణ్, జాన్వీల పర్ఫార్మెన్స్ అదరహో:

రామ్ చరణ్ తన కెరీర్‌లోనే మరో సరికొత్త, వైవిధ్యమైన పాత్రలో జీవించేశాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ ఎలిమెంట్స్‌లో చరణ్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక జాన్వీ కపూర్ కూడా గ్లామర్‌కే పరిమితం కాకుండా తన యాక్టింగ్‌తో మంచి మార్కులు కొట్టేసింది. వీరితో పాటు జగపతి బాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు తమ పవర్‌ఫుల్ నటనతో సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు.

బుచ్చిబాబు సానా మేకింగ్.. రెహమాన్ మ్యూజిక్ మ్యాజిక్:

‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు సానా రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషన్స్‌ను, స్పోర్ట్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ తెరకెక్కించిన తీరు అద్భుతమనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్.. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్. ఇక ప్రతి ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్‌లో రెహమాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేసి గుండెల్ని పిండేసింది.

మొత్తానికి థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ‘పెద్ది’.. ఇప్పుడు డిజిటల్ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లోనూ నంబర్-1 స్థానంలో ట్రెండ్ అవుతూ తన సత్తా చాటుతోంది. ఇక థియేటర్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోనూ ఇంతటి భారీ ఆదరణ దక్కించుకోవడంతో, రామ్ చరణ్ ఖాతాలో మరో మైల్‌స్టోన్ సూపర్ హిట్ చేరిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ మీరు ఇంకా చూడకపోతే నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త సీన్స్‌తో ఉన్న ‘పెద్ది’ని చూసి ఎంజాయ్ చేసేయండి.