పెద్ది వర్సెస్ ప్యారడైజ్.. ఎవరు తగ్గట్లేదంతే..!
మార్చి 26న నాని ది ప్యారడైజ్ వస్తుంటే.. ఒకరోజు తర్వాత మార్చి 27న పెద్ది రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఐతే ఆరోజు చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అనుకున్నారు.
By: Ramesh Boddu | 22 Oct 2025 2:00 PM ISTసంక్రాంతి, దసరా మాత్రమే కాదు సమ్మర్ కి ముందు అంటే మార్చి ఎండింగ్ కూడా సినిమాలకు కలిసి వచ్చే సీజన్ లా భావిస్తున్నారు మేకర్స్. ఎందుకంటే మార్చిలో కొంతమంది స్టూడెంట్స్ కి ఎలాగు ఎగ్జామ్స్ పూర్తవుతాయి. ఆ తర్వాత ఏప్రిల్ లో ఎలాగు సమ్మర్ హాలీడేస్ ఇస్తారు. అందుకే ఆ సీజన్ లో సినిమాలు రిలీజ్ అయితే మంచి సక్సెస్ అయ్యే ఛాన్స్ లు ఉంటాయని దర్శక నిర్మాతలు అలా ఫిక్స్ అయ్యారు. ఐతే ఈసారి అదే నెక్స్ట్ ఇయర్ 2026 మార్చి ఎండింగ్ కి రెండు సినిమాలు ఫైట్ జరగబోతున్నాయి. అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది ఒకటి రేసులో వస్తుండగా న్యాచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ కూడా వస్తుంది.
రెండు సినిమాలు రెండు డిఫరెంట్ జోనర్..
మార్చి 26న నాని ది ప్యారడైజ్ వస్తుంటే.. ఒకరోజు తర్వాత మార్చి 27న పెద్ది రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఐతే ఆరోజు చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అనుకున్నారు. ఐతే మళ్లీ రిలీజ్ డేట్ ఒకరోజు ముందు అంటే మార్చి 26నే ఫిక్స్ చేస్తున్నారని టాక్. ఐతే ఈ రెండు సినిమాలు రెండు డిఫరెంట్ జోనర్ సినిమాలుగా వస్తున్నాయి.
నాని శ్రీకాంత్ ఓదెల కంప్లీట్ గా వాళ్ల సేఫ్ జోన్ వదిలి భారీ ప్రయోగాన్నే చేస్తున్నారు. ది ప్యారడైజ్ లో జడల్ రోల్ లో నాని కనిపించబోతున్నాడు. ఈ రోల్ తో నాని మరోసారి తన సత్తా చాటుతాడని అంటున్నారు. ఐతే ఈ సినిమా కాన్సెప్ట్ ఇంకా స్క్రీన్ ప్లే అంతా కూడా నాని సత్తానికి చాటుతాయని అంటున్నారు.
పెద్ది విషయంలో బుచ్చి బాబు చరణ్ కూడా అంతే కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. సినిమాలో చరణ్ లుక్ ఇంకా స్టోరీ అంతా కూడా వేరే లెవెల్ లో ఉంటాయట. తప్పకుండా మెగా ఫ్యాన్స్ కి ఒక రేంజ్ లో మాస్ ఫీస్ట్ ఇచ్చేలా పెద్ది వస్తుంది.
పెద్ది సినిమాలో శివ రాజ్ కుమార్.. ప్యారడైజ్ లో మోహన్ బాబు..
పెద్ది సినిమాలో శివ రాజ్ కుమార్ స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నారు. అలానే నాని ది ప్యారడైజ్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ గా నటిస్తున్నారు. పెద్ది, ది ప్యారడైజ్ ప్రస్తుతం రేసులో రెండు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల ఫైట్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. రెండు సినిమాలు ఎక్కడ ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు.
చరణ్ తో నాని పోటీ అనేదాని కన్నా రెండు సినిమాలు తెలుగు ఆడియన్స్ కు మరో సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ది ప్యారడైజ్ డైరెక్టర్ శ్రీకాంత్ కూడా తొలి సినిమా దసరాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు.. బుచ్చి బాబు కూడా ఉప్పెనతో సెన్సేషనల్ హిట్ కొట్టి రెండో సినిమా పెద్ది చేస్తున్నాడు. డైరెక్టర్స్ కూడా తమ రెండో సినిమా ది బెస్ట్ అనిపించుకునేలా చేయాలని ఎఫర్ట్స్ పెడుతున్నారు.
