Begin typing your search above and press return to search.

బుచ్చి బాబు మరీ ఇంత బ్లైండ్‌గా ఫాలో అవుతాడా...!

రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న పెద్ది సినిమా షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

By:  Ramesh Palla   |   9 Aug 2025 9:00 PM IST
బుచ్చి బాబు మరీ ఇంత బ్లైండ్‌గా ఫాలో అవుతాడా...!
X

రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న పెద్ది సినిమా షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి నెలలో సినిమాను విడుదల చేయాల్సి ఉన్న విషయం తెల్సిందే. సినిమాను ఈ ఏడాదిలోనే ముగించి వచ్చే ఏడాది ఆరంభం నుంచే ప్రమోషన్స్‌ షురూ చేయాలని బుచ్చిబాబు ప్లాన్‌గా తెలుస్తోంది. ఉప్పెన సినిమా తర్వాత బుచ్చిబాబు నుంచి రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా ఉంటుంది అనే విశ్వాసం ను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి రంగస్థలం సినిమాతో పోల్చుతూ సోషల్‌ మీడియాలో చర్చ జరగడం మనం చూస్తూ ఉన్నాం.

పెద్ది సినిమాతో రామ్‌ చరణ్‌..!

బుచ్చిబాబు గురువు అయిన సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు రామ్‌ చరణ్‌ తో తన గురువు ఎలా అయితే రంగ స్థలం సినిమాను తీసి సూపర్‌ హిట్‌ కొట్టాడో అలాగే బుచ్చిబాబు కూడా భారీ విజయాన్ని పెద్ది సినిమాతో దక్కించుకోవాలని చూస్తున్నాడు. అందుకు తగ్గట్లుగానే ఒక స్పోర్ట్స్‌ డ్రామా ను ఎంపిక చేసుకోవడం జరిగింది. రామ్‌ చరణ్‌ ను ఫుల్‌గా వాడేసుకుంటున్నట్లు ఆ మధ్య దర్శకుడు బుచ్చిబాబు ఒక చిట్‌ చాట్‌ లో చెప్పుకొచ్చాడు. అద్భుతమైన నటుడు రామ్‌ చరణ్‌ అని, పెద్ది సినిమాతో మరోసారి ఆ విషయం నిరూపితం కాబోతుంది అంటూ యూనిట్‌ సభ్యులు బలంగా చెబుతున్నారు. పెద్ది సినిమా ఫస్ట్‌ షాట్‌ విడుదలైనప్పటి నుంచి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.

రంగస్థలం తరహా ఐటెం సాంగ్‌

రంగస్థలం సినిమా ను చూసినట్లుగా ఉందని, రంగస్థలం పోలికలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలు సినిమాపై అంచనాలు మరింతగా పెంచుతున్నాయి. అందుకే రంగస్థలం సినిమా తరహాలోనే ఈ సినిమాలోనూ ఒక ప్రత్యేకమైన సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్‌తో ఈ సినిమా కోసం ఒక మంచి ఐటెం సాంగ్‌ ను బుచ్చిబాబు చేయించారని వార్తలు వస్తున్నాయి. ఆ ఐటెం సాంగ్ లో సమంతను నటింపజేయాలని సుకుమార్‌ బలంగా కోరుకుంటున్నాడట. తన గురువు సుకుమార్‌ రంగస్థలం సినిమాలో సమంతను నటింపజేసిన నేపథ్యంలో ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ కావాలనే ఉద్దేశంతో కనీసం పెద్దిలో ఆమెతో ఐటెం సాంగ్‌ అయినా చేయించాలని భావిస్తున్నాడు.

పుష్ప లో సమంత ఐటెం సాంగ్‌

సుకుమార్‌ తన పుష్ప సినిమాలో సమంతతో ఐటెం సాంగ్‌ చేయించాడు. అలా కూడా సుకుమార్‌ ను బుచ్చిబాబు ఫాలో అవ్వాలి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బుచ్చిబాబు తన మేకింగ్‌ స్టైల్‌ను సపరేట్‌గా క్రియేట్‌ చేసుకోకుండా గురువును ఎక్కువగా కాపీ చేస్తున్నాడంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఇంత బ్లైండ్‌గా సుకుమార్‌ ను ఫాలో అయితే బుచ్చి బాబు తన సొంత ప్రతిభ ఎక్కడ చూపించినట్లు అవుతుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు పెద్ది సినిమా కోసం సమంత ను సంప్రదించారా లేదా అనేది తెలియదు.. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున సుకుమార్‌ ను బుచ్చిబాబు బ్లైండ్‌గా ఫాలో అవుతున్నాడు, సమంత ఎంపిక నిర్ణయం సరైనది కాదు అంటూ విమర్శలు చేస్తున్నారు. మరి దీనికి బుచ్చిబాబు నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందా అనేది చూడాలి.