Begin typing your search above and press return to search.

చరణ్‌ గాయం తరువాత.. ఇది జరిగింది!

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు.

By:  M Prashanth   |   25 March 2026 5:43 PM IST
చరణ్‌ గాయం తరువాత.. ఇది జరిగింది!
X

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. గ్రామీణ నేపథ్యంతో సాగే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే లేటెస్ట్ గా రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించి ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో రామ్ చరణ్‌కు స్వల్ప గాయం అయింది. కంటి దగ్గర చిన్న దెబ్బ తగలడంతో ఒక్కసారిగా చిత్ర యూనిట్ అంతా ఆందోళన చెందింది. ఈ వార్త బయటకు రావడంతో మెగా అభిమానులు కూడా చరణ్ ఆరోగ్యం గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.

సాధారణంగా ఇలాంటి గాయాలు అయినప్పుడు హీరోలు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడం సర్వసాధారణం. ‘పెద్ది’ వంటి భారీ చిత్రాల్లో యాక్షన్ సీన్లు చాలా రిస్కీగా ఉంటాయి, అందులోనూ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కావడంతో ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటుంది. మేకర్స్ కూడా చరణ్‌ను రెండు రోజులు రెస్ట్ తీసుకోమని సూచించినట్లు వార్తలు వచ్చాయి. కానీ సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండటంతో షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో చిత్ర యూనిట్ చాలా టైట్‌గా ఉంది. ఇలాంటి సమయంలో గాయం వార్త అందరినీ కొంత ఇబ్బందికి గురిచేసింది.

అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. చరణ్‌కు గాయం అయిన మాట వాస్తవమే అయినా, ఆయన మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. గాయం చిన్నదే కావడంతో చరణ్ ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా వెంటనే షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. తన వల్ల సినిమా పనులు ఆగిపోకూడదని, అనుకున్న సమయానికి సినిమాను సిద్ధం చేయాలనే పట్టుదలతో చరణ్ మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. పెద్దగా బ్రేక్ కూడా తీసుకోకుండా రేపటి నుంచి జరగబోయే బ్యాలెన్స్ షూటింగ్‌లో కూడా ఆయన యధావిధిగా పాల్గొనబోతున్నారు.

సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండటంతో, ప్రతి నిమిషం మేకర్స్‌కు చాలా కీలకం. ఏప్రిల్ 30న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. అందుకే చరణ్ ఎక్కడా ఆలస్యం చేయకుండా స్పెషల్ సాంగ్ చిత్రీకరణలో కూడా పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు మార్చి 27న చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘పెద్ది’ టీజర్‌ను విడుదల చేసేందుకు బుచ్చిబాబు టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ టీజర్ తోనే సినిమా రేంజ్ ఏంటో చూపించాలని వారు కసితో ఉన్నారు.

ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. చరణ్ ఒక పక్కా లోకల్ మాస్ అవతారంలో కనిపించబోతున్నాడని, అందుకే ఆయన లుక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. ఇన్ని పెద్ద బాధ్యతలు ఉన్నప్పుడు ఒక చిన్న గాయం కోసం షూటింగ్ ఆపడం చరణ్‌కు ఇష్టం లేదట. అందుకే ఆయన పక్కా ప్రొఫెషనల్ గా తన పని పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు.

చరణ్ గాయం విషయంలో అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన ఫుల్ ఎనర్జీతో సెట్స్ లోనే ఉన్నారని క్లారిటీ వచ్చేసింది. సినిమా సక్సెస్ కోసం ఆయన పడుతున్న శ్రమ చూస్తుంటే ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించడం ఖాయమనిపిస్తోంది. యాక్షన్ సీన్ల నుంచి ఎమోషనల్ సీన్ల వరకు చరణ్ ఈ సినిమాలో తన విశ్వరూపం చూపించబోతున్నాడట. మరి ఏప్రిల్ 30న ఈ పెద్ది వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.