Begin typing your search above and press return to search.

చరణ్ 'పెద్ది'.. ఆ విషయంలో నో డౌట్..

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు పెద్ది మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   9 Oct 2025 12:20 AM IST
చరణ్ పెద్ది.. ఆ విషయంలో నో డౌట్..
X

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు పెద్ది మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. పీరియాడికల్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సమర్పిస్తున్నాయి.

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్‌ కుమార్, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతి బాబు కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. సినిమాలో చరణ్ కంప్లీట్ మాస్ లుక్ లో కనిపించనుండగా.. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన అప్డేట్స్ లో లాంగ్ హెయిర్, మందపాటి గడ్డం, బలమైన శరీరాకృతితో నెవ్వర్ బిఫోర్ అనేలా ఉన్నారు.

దీంతో సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంతా ఫిక్స్ అయ్యారు. చరణ్ గట్టి కమ్ బ్యాక్ ఇస్తారని డిసైడ్ అయ్యారు. సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది చరణ్ బర్త్ డే కానుకగా మార్చి 27న మూవీ రిలీజ్ అవుతుందనే ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు.

కానీ అప్పుడు రిలీజ్ అవ్వకపోవచ్చని.. సమ్మర్ లేదా దసరాకు వాయిదా పడొచ్చని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకు షూటింగ్ డిలే కారణమని వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని తెలుస్తోంది. అనుకున్న విధంగానే షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు మేకర్స్. ఎక్కడా ఎలాంటి లేట్ అవ్వడం లేదట.

ఇప్పటికే సినిమాకు సంబంధించిన 60 శాతం షూటింగ్ పూర్తి అయిందని తెలుస్తోంది. దాదాపు ఫస్ట్ హాఫ్ పూర్తి అయినట్లు సమాచారం. అదే సమయంలో మేకర్స్.. ఓవైపు సినిమా షూటింగ్ చేస్తూనే, మరోవైపు ఎడిటింగ్ కూడా చేస్తున్నారని వినికిడి. ఏ విషయంలో ఎక్కడా ఎలాంటి లాగ్ లేకుండా చేసుకుంటున్నట్లుగా టాక్ నడుస్తోంది.

ఇప్పుడు తొలి సాంగ్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారని, అందుకు గాను మహారాష్ట్రలోని పుణేలో షూట్ చేయడానికి టీమ్ పయనమవుతోంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో సాంగ్‌ ను రామ్ చరణ్‌ తో పాటు జాన్వీ కపూర్‌ పై చిత్రీకరణ చేయనున్నారట. ఒక విజువల్ ట్రీట్‌ లాగా సాంగ్ ఉంటుందని, ఏఆర్ రెహమాన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారట. ఏదేమైనా పెద్ది మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదని చెప్పాలి.