Begin typing your search above and press return to search.

నేడే ఘనంగా పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ తో చరణ్ సందడి!

ముఖ్యంగా ఈ సినిమా జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో భారీ స్థాయిలో అభిమానులను ఆకట్టుకునేలా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి చిత్ర బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

By:  Madhu Reddy   |   1 Jun 2026 12:46 PM IST
నేడే ఘనంగా పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ తో చరణ్ సందడి!
X

ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లోనే డైరెక్టర్గా తనను తాను ప్రూవ్ చేసుకున్న యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా వస్తున్న విలేజ్ స్పోర్ట్స్ డ్రామా మూవీ పెద్ది. ఈ ఏడాది మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా పలు కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు ఘనంగా నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఎవరెవరు రానున్నారు? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి.

చిత్ర బృందం ప్రత్యేక ఏర్పాట్లు..

ముఖ్యంగా ఈ సినిమా జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో భారీ స్థాయిలో అభిమానులను ఆకట్టుకునేలా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి చిత్ర బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగానే విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నేడు సాయంత్రం 5:00 గంటల నుంచి పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా ప్రారంభించనున్నారు.

చీఫ్ గెస్ట్ గా ఏపీ డీసీఎమ్..

అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ డీసీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఓకే వేదికపై పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ సందడి చేయబోతుండడంతో మెగా అభిమానులలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇక చాలా రోజులు తర్వాత మళ్లీ ఒకే వేదికపై బాబాయ్- అబ్బాయ్ కనిపించబోతున్నారని తెలిసి అబ్బాయిలు కూడా ఈవెంట్ కి హాజరు కావడానికి బయలుదేరుతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ ఈవెంట్లో హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు..

సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా ఈవెంట్ జరుగుతోంది అంటేనే భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా అరేంజ్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ డీసీఎం అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేయబోతున్నారని తెలియడంతో అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలివస్తారన్న నేపథ్యంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా అభిమానుల కోసం ప్రత్యేక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. అభిమానులకు , ప్రజలకు, వాహనదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు.

జూన్ 4న థియేటర్లలో సందడి..

పెద్ది సినిమా విషయానికి వస్తే.. భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా జూన్ 4వ తేదీన థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అచ్చియమ్మ పాత్రలో జాన్వీ కపూర్, అప్పలసూరి పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు. అలాగే శివ రాజ్ కుమార్ తో పాటు దివ్యేందు శర్మ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య జూన్ 4న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.