Begin typing your search above and press return to search.

'పెద్ది' ఆటకు ఇంకా అనుకూలమే...!

రామ్‌ చరణ్‌, బుచ్చి బాబు కాంబోలో వచ్చిన 'పెద్ది' సినిమాకు భారీ ఓపెనింగ్‌ నమోదు అయింది.

By:  Ramesh Palla   |   12 Jun 2026 2:46 PM IST
పెద్ది ఆటకు ఇంకా అనుకూలమే...!
X

రామ్‌ చరణ్‌, బుచ్చి బాబు కాంబోలో వచ్చిన 'పెద్ది' సినిమాకు భారీ ఓపెనింగ్‌ నమోదు అయింది. చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం సినిమా బ్రేక్‌ ఈవెన్‌కి చేరువ అయ్యింది. కొన్ని చోట్ల స్వల్ప తేడాతో బ్రేక్‌ ఈవెన్‌కి రెడీగా ఉంది, కొన్ని చోట్ల రెండో వారం పూర్తి అయ్యేప్పటికి బ్రేక్‌ ఈవెన్‌ సాధ్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. పెద్ది సినిమాకు పోటీ పెద్దగా లేదు. ముఖ్యంగా తెలుగు బాక్సాఫీస్ వద్ద పెద్దికి రెండో వారం కూడా పోటీ లేదు. గత కొన్ని వారాలుగా పెద్ద సినిమాలు లేకపోవడంతో పాటు, చిన్న సినిమాలు హిట్‌ కాకపోవడంతో పెద్ది సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులు క్యూ కట్టారు. దాంతో మొదటి వారంలో భారీ ఎత్తున వసూళ్లు నమోదు అయ్యాయి. సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినప్పటికీ, దాంతో సంబంధం లేకుండా వసూళ్లు నమోదు అయ్యాయి. మొదటి వారం వసూళ్ల విషయంలో నిర్మాతలు హ్యాపీగానే ఉన్నట్లు తెలుస్తోంది.

పెద్ది సినిమా వసూళ్లు...

రెండో వారం సినిమా వసూళ్ల విషయంలో సస్పెన్స్‌ నెలకొంది. ఇప్పటికే సినిమా భారీ వసూళ్లు రాబట్టిన నేపథ్యంలో రెండో వారం సాలిడ్‌ కలెక్షన్స్‌ను రాబట్టగలిగితే బయ్యర్లు బయట పడే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లేందుకు గాను ఇంకా పబ్లిసిటీ చేస్తున్నారు. రెండో వారంలో థియేటర్లకు ప్రేక్షకులను రప్పించగలిగితే ఆ సినిమా కమర్షియల్‌ హిట్‌గా పరిగణిస్తున్నారు. కనుక పెద్ది సినిమా రెండో వారంలోనూ థియేటర్లు ప్రేక్షకులతో నిండితే తెలుగు రాష్ట్రాల్లో మెజార్టీ ఏరియాల్లో బ్రేక్‌ ఈవెన్‌ ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో ప్రేక్షకులు పెద్ది సినిమా థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. ఆ ఫ్లో రెండో వారం కొనసాగితే కచ్చితంగా నిర్మాతలు, బయ్యర్లు బయట పడ్డట్లే అని బాక్సాఫీస్‌ వర్గాల వారు అంటున్నారు.

రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌ జోడీగా...

పెద్ది సినిమాకు మొదటి వారం బాక్సాఫీస్‌ వద్ద చిన్న సినిమాల పోటీ కూడా లేదు. కానీ రెండో వారంలో చిన్న సినిమా సింగ్‌ గీతం విడుదల అయ్యింది. అయితే ఆ సినిమా మాస్ ఆడియన్స్‌ ను ఎంత వరకు ఆకట్టుకుంటుంది అనే విషయం లో క్లారిటీ లేదు. మాస్‌ ఎలిమెంట్స్‌తో పాటు, కమర్షియల్‌ మూవీగా పేరు తెచ్చుకున్న పెద్ది సినిమా పట్ల అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. కనుక సెకండ్‌ వీక్‌ కి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే ఎడిటింగ్‌ కట్స్‌ తో కొత్త వర్షన్‌ ను థియేటర్‌లో కొత్త పెద్ది ఆడుతోంది. పైగా జాన్వీ కపూర్ సీన్స్ కట్‌ చేయడంతో కొన్ని కొత్త షాట్స్ ను యాడ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఇప్పటికే చూసిన వారు సైతం మళ్లీ చూడాలి అనుకోవచ్చు. మేకర్స్‌ ఆ ఉద్దేశంతోనే పెద్దిని జనాల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌ చరణ్‌...

రామ్‌ చరణ్‌ యాక్టింగ్‌తో పాటు, బుచ్చిబాబు మేకింగ్‌ కి ప్రశంసలు దక్కుతున్నాయి. హీరోయిన్‌ సీన్స్‌ విషయమై విమర్శలు వచ్చినా ఇప్పటికే వాటిని తొలగించినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈతరం యూత్‌కి ఇలాంటి సినిమాలను చూపించాల్సిన అవసరం చాలా ఉందంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెద్ది సినిమా వంటి సినిమాలు మరిన్ని రావాలంటూ కొందరు సినీ వర్గాల వారు ప్రశంసలు కురిపించడం మనం చూశాం. ఎంతో మంది స్టార్స్ పెద్ది సినిమా చూసి సోషల్‌ మీడియాలో రివ్యూ షేర్ చేశారు. దాంతో పెద్ది సినిమాకు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. రెండో వారంలోనూ ఆ జోరు కొనసాగే విధంగా అవకాశాలు ఉన్నాయి. పెద్ది ఆడే ఆటకు రెండో వారం కూడా పెద్దగా పోటీ లేదు. పోటీ లేని గ్రౌండ్‌ లో పెద్ది ఒంటరిగా ఆడితే కచ్చితంగా మంచి ఫలితం దక్కే అవకాశాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగా మేకర్స్‌ ప్రమోషన్స్‌ చేయాల్సిన అవసరం ఉంది. మరి మైత్రి మేకర్స్‌ వారు ఏ మేరకు ప్రమోషన్‌ చేసి ఈ రెండో వారం పెద్ది ఆటకు అనుకూలంగా మార్చుతారు అనేది చూడాలి.