Begin typing your search above and press return to search.

మోస్ట్ అవైటెడ్ 'పెద్ది'.. ఇన్స్పిరేషన్‌ గా నిలుస్తుందా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన పెద్ది సినిమా విడుదలకు ముందే హాట్ టాపిక్ గా మారింది.

By:  M Prashanth   |   2 Jun 2026 9:00 PM IST
మోస్ట్ అవైటెడ్ పెద్ది.. ఇన్స్పిరేషన్‌ గా నిలుస్తుందా?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన పెద్ది సినిమా విడుదలకు ముందే హాట్ టాపిక్ గా మారింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా కథ, క్యాస్టింగ్ కంటే ఎక్కువగా ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నది మూవీ టీమ్ ప్రమోషన్ స్ట్రాటజీ కోసమే.

సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలకు ముందు కొన్ని రోజుల పాటు ప్రమోషన్స్ నిర్వహిస్తుంటారు. కానీ పెద్ది విషయంలో మాత్రం మూవీ టీమ్ చాలా ముందుగానే స్పెషల్ ప్లాన్ తో ముందుకు వెళ్ళింది. సినిమా షూటింగ్ కొనసాగుతూనే ఆడియన్స్ లో బజ్ తగ్గకుండా వరుసగా అప్డేట్స్ ఇస్తూ వచ్చింది. పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్, ఇంటర్వ్యూలు ఇలా ప్రతి స్టేజ్ లో సినిమాపై చర్చ కొనసాగేలా చూసింది.

నిజానికి పెద్ది మూవీ పలుమార్లు విడుదల తేదీలు మార్చుకున్నప్పటికీ ప్రేక్షకులలో ఉన్న ఆసక్తి తగ్గిపోకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ప్రతి అప్డేట్‌ ను ఒక ఈవెంట్‌ లా మార్చి సోషల్ మీడియాలోనూ, అభిమానుల్లోనూ సినిమా గురించి చర్చ జరిగేలా చేశారు. దీంతో విడుదలకు ముందే పెద్దికి స్ట్రాంగ్ బజ్ ఏర్పడింది. కచ్చితంగా మూవీ చూడాలనే హైప్ క్రియేట్ అయింది.

ఇటీవల మూవీ టీమ్ ప్రమోషన్స్ ను మరింత స్పీడప్ చేసింది. హీరో రామ్ చరణ్‌ తో పాటు దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాతలు, టెక్నీషియన్స్, మెయిన్ క్యాస్టింగ్ వరుసగా ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. సినిమా విశేషాలతో పాటు చిత్ర నిర్మాణానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా షేర్ చేసుకుంటున్నారు. స్పెషల్ గా రామ్ చరణ్ వ్యవహరించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.

షూటింగ్ షెడ్యూల్స్, జర్నీలతో అలిసిపోయినప్పిటికీ ఉన్నప్పటికీ ప్రమోషన్స్ లో చాలా అంటే చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. సినిమా కోసం ఆయన చూపిస్తున్న డెడికేషన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక పెద్ద సినిమాకు హీరో ప్రమోషన్లలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషించాలో రామ్ చరణ్ చూపిస్తున్నారని మెగా అభిమానులతోపాటు సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.

మూవీ టీమ్ సౌత్ మార్కెట్‌ తో పాటు హిందీ ప్రేక్షకులపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. నార్త్ లో నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అక్కడ జరిగిన ఈవెంట్లకు వచ్చిన ప్రేక్షకుల సంఖ్య, సోషల్ మీడియాలో కనిపించిన రెస్పాన్స్.. మూవీ టీమ్ లో మరింత నమ్మకాన్ని పెంచిందని తెలుస్తోంది. అలా సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడం ఎంత ముఖ్యమో పెద్ది ప్రమోషన్లు గుర్తు చేశాయి.

కేవలం సినిమా నిర్మాణంపైనే కాకుండా, దాన్ని ప్రేక్షకుల దగ్గరకు ఎలా తీసుకెళ్లాలన్న దానిపై కూడా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. అయితే ప్రమోషన్స్ కు తగ్గ రిజల్ట్ బాక్సాఫీస్ వద్ద వస్తుందా లేదా అన్నది సినిమా విడుదల తర్వాత తేలనుంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్. రిలీజ్ కు ముందే పెద్ది తన ప్రమోషన్ స్ట్రాటజీతో గుర్తింపు సంపాదించింది. సినిమా ఆశించిన విజయాన్ని అందుకుంటే, రాబోయే రోజుల్లో పెద్ద చిత్రాల ప్రమోషన్స్ కు పెద్ది మూవీ ఇన్స్పిరేషన్ గా నిలవడం గ్యారంటీ అని చెప్పాలి.