రంగస్థలం నుంచి పెద్ది వరకు… చరణ్ యాక్టింగ్ ఎవల్యూషన్‌పై జగపతి బాబు కామెంట్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. అయితే ఆయన కేవలం ఇమేజ్ పరంగానే కాకుండా, నటుడిగా కూడా శిఖరాలను చేరుకుంటున్నారని ‘పెద్ది’ చిత్రం నిరూపిస్తోంది.
By: Madhu Reddy | 12 Jun 2026 7:00 AM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. అయితే ఆయన కేవలం ఇమేజ్ పరంగానే కాకుండా, నటుడిగా కూడా శిఖరాలను చేరుకుంటున్నారని ‘పెద్ది’ చిత్రం నిరూపిస్తోంది. ఈ సినిమాలో చరణ్ నటనపై సీనియర్ నటుడు జగపతి బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఒక స్టార్ హీరో తన పరిమితులను దాటి ‘పెద్ది’ కోసం పడ్డ కష్టం, ఆయన సాధించిన పరిణతిపై జగపతి బాబు ఓ చిట్ చాట్ లో పంచుకున్న విశేషాలు..ఇప్పుడు చూద్దాం..
రంగస్థలం ఒక మొదలు.. పెద్ది ఒక పీక్:
జగపతి బాబు మాట్లాడుతూ "నేను గతంలో ‘రంగస్థలం’ సినిమా చేస్తున్నప్పుడు ఒక మాట అన్నాను.. రామ్ చరణ్ తొలిసారి ఒక నటుడిగా నన్ను ఆకట్టుకున్నాడు అని. ఆ తర్వాత ఆయన సినిమా సినిమాకి 10x, 20x ఎదుగుతూ వచ్చారు. కానీ ‘పెద్ది’ సినిమాలో ఆయన నటన పీక్స్‌లో ఉంది. ఇక ఒక మెగాస్టార్ కొడుకు, గ్లోబల్ స్టార్ అయ్యి ఉండి కూడా.. తన స్టార్‌డమ్‌ను పక్కన పెట్టి ఒక క్యారెక్టర్‌లో అంతలా పరకాయ ప్రవేశం చేయడం అన్ బిలీవబుల్. రంగస్థలంలో ఎమోషన్ ప్లే చేయడం ఒక ఎత్తు అయితే, ‘పెద్ది’ కోసం తన బాడీని మార్చుకుని, నటించడం ఒక అద్భుతం."
మనిషి చేసే పని కాదు.. ప్రాణం పెట్టి చేశారు:
ఇక జగపతిబాబు మాట్లాడుతూ "రామ్ చరణ్ ఈ సినిమా కోసం పడ్డ కష్టం సామాన్యమైనది కాదు. కేవలం డైలాగ్స్ చెప్పడం, ఫైట్స్ చేయడం కాకుండా.. మెంటల్‌గా, ఫిజికల్‌గా ఆయన తనను తాను కరిగించుకున్నారు. మనిషి చేయగలిగే పని కంటే ఎక్కువే చేశారు. రంగస్థలం తర్వాత ఆయన ఎదుగుదల అద్భుతం. ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్‌ను చూస్తుంటే ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు అనిపిస్తుంది. ఇక సినిమాలో ఎక్కడా మనకు స్టార్ రామ్ చరణ్ కనిపించరు, కేవలం ‘పెద్ది’ మాత్రమే కనిపిస్తాడు."
నేషనల్ అవార్డుకు తగిన నటన: బుచ్చిబాబు విజన్:
దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ చరణ్ గారి నిబద్ధతను కొనియాడారు. "నేను కథ రాసుకున్నప్పుడే చరణ్ గారికి నేషనల్ అవార్డు రావాలని కోరుకున్నాను. కానీ ఇప్పుడు సినిమా చూసిన ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ స్వయంగా ఆ మాటే అంటున్నారు. రామ్ చరణ్ గారికి ఖచ్చితంగా నేషనల్ అవార్డు రావాల్సిందే అని జనాలు చర్చించుకోవడం మా టీమ్ విజయం. ఒక స్టార్ హీరో తన ఇమేజ్ గురించి ఆలోచించకుండా, ఇంతటి ఎమోషనల్ పాత్రను ఓన్ చేసుకోవడం వల్లనే ఈ సక్సెస్ సాధ్యమైంది."
సక్సెస్‌లో చరణ్ విజన్.. భుజం మీద ఎత్తుకున్న ప్రేక్షకులు:
మొదటి రోజున కొన్ని నెగిటివ్ ట్రోల్స్ వచ్చినా, సినిమాలోని ఎమోషన్ వల్ల రెండో రోజు నుంచే పాజిటివ్ టాక్ మొదలైందని జగపతి బాబు అభిప్రాయపడ్డారు. "ప్రేక్షకులు మొదటి రోజు ఎక్స్పెక్టేషన్స్‌తో వచ్చారు, కానీ రోజులు గడిచేకొద్దీ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. చరణ్ గారి నటన, బుచ్చిబాబు రాసుకున్న కథలోని నిజాయితీ మెల్లమెల్లగా జనాల్లోకి వెళ్ళింది. ఇది కేవలం విజిల్స్ వేసే సినిమా కాదు, గుండెతో ఫీల్ అయ్యే సినిమా. ఇప్పుడు ప్రేక్షకులు ఈ సినిమాను తమ భుజాల మీద మోస్తున్నారు." అని తెలిపాడు.
రామ్ చరణ్ కేవలం స్టార్‌డమ్ వెంటే వెళ్లకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. ‘పెద్ది’ చిత్రం ఆయన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవడమే కాకుండా, ఒక స్టార్ హీరో ఏ స్థాయికి ఎదగగలరో ప్రపంచానికి చాటిచెప్పింది. జగపతి బాబు అన్నట్లుగా, చరణ్ అనే నటుడు ఇప్పుడు ఏ అడ్డంకులు లేని మహా ప్రవాహంలా సాగిపోతున్నారు.
