చరణ్ యాక్టింగ్ పై అత్తగారి ఆస్కార్ కామెంట్స్!
రామ్ చరణ్ కొత్త సినిమా పెద్ది థియేటర్లలోకి వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సినిమాను మెగా ఫ్యామిలీతో పాటు అపోలో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూశారు.
By: M Prashanth | 5 Jun 2026 3:42 PM ISTరామ్ చరణ్ కొత్త సినిమా పెద్ది థియేటర్లలోకి వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సినిమాను మెగా ఫ్యామిలీతో పాటు అపోలో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూశారు. సాధారణంగా అపోలో ఫ్యామిలీ మొత్తం ఇలా ఒకేసారి థియేటర్ కు వచ్చి సినిమా చూడటం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ చరణ్ మీద ఉన్న ప్రేమతో ఉపాసన తల్లి శోభనా కామినేని కూడా ఫ్యామిలీతో కలిసి వెళ్లి సినిమాను ఫుల్ గా ఎంజాయ్ చేశారు.
సినిమా చూసి బయటకు రాగానే మీడియాతో మాట్లాడిన శోభనా కామినేని చాలా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సినిమా అమేజింగ్ గా ఉందని, చరణ్ యాక్టింగ్ కు తాను ఆస్కార్ ఇస్తానని ఆమె ఇంగ్లీష్ లో చెప్పారు. అలాగే ఆమె థియేటర్లో ఒక మాస్ ఆడియెన్ గా పేపర్లు ఎగరేయడంపై ప్రశ్నలు రాగా సరదాగా నవ్వుతూ వెళ్లారు. ఒక ఆడియన్ గా చరణ్ యాక్టింగ్ కు ఆస్కార్ ఇవ్వొచ్చు అని ఆమె జెన్యూన్ గా మెచ్చుకున్నారు.
ఆమె మీడియాతో తక్కువ మాటలే మాట్లాడినా, లోపల ఫ్యామిలీ మొత్తం చరణ్ యాక్టింగ్ కు పూర్తిగా ఫిదా అయిపోయారని వాళ్ల ఆనందం చూస్తే ఈజీగా అర్థమవుతోంది. సినిమాలో చరణ్ ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మన్స్ చూసి కుటుంబ సభ్యులు అందరూ ఎంతో గర్వంగా ఫీలయ్యారు. ఇంట్లో ఎప్పుడూ సైలెంట్ గా ఉండే చరణ్, స్క్రీన్ మీద అంత పవర్ ఫుల్ గా పల్లెటూరి కుర్రాడిగా నటించడం చూసి వాళ్లకు ఫుల్ కిక్ వచ్చింది.
ఇక సినిమా విషయానికి వస్తే చరణ్ ఇందులో తన కెరీర్ లోనే బెస్ట్ యాక్టింగ్ ఇచ్చాడని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఒక మారుమూల పల్లెటూరి కుర్రాడిగా తనను తాను మార్చుకున్న తీరు అందరికీ బాగా నచ్చిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో కుస్తీ, క్రికెట్ లాంటి డిఫరెంట్ ఆటల కోసం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మీద చరణ్ పెట్టిన ఎఫర్ట్ ప్రతి ఫ్రేమ్ లోనూ తెలుస్తుందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. రంగస్థలం చిట్టిబాబును మించిపోయేలా పెద్ది క్యారెక్టర్ లో ప్రాణం పెట్టి నటించాడని ముందే మేకర్స్ ప్రమోట్ చేశారు.
డైరెక్టర్ బుచ్చిబాబు సనా ఈ స్టోరీని ఎమోషనల్ గా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తీశాడని చాలామంది చెబుతున్నారు. ఊరి తలరాతను మార్చేందుకు ఒక ఆటగాడు చేసే పోరాటాన్ని తెరపై చూపించిన విధానం ఆడియన్స్ ను కట్టిపడేస్తోందని టాక్ నడుస్తోంది. కథలో కీలకమైన అప్పలసూరి క్యారెక్టర్ లో జగపతిబాబు నటన సినిమాకు పెద్ద ప్లస్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ లో వచ్చే ట్విస్ట్ సినిమా రేంజ్ ను పెంచేసిందని, దానికి ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ గా సెట్ అయిందని మరికొన్ని కామెంట్స్ పాజిటివ్ గా వినిపిస్తున్నాయి.
ఫస్ట్ హాఫ్ లో క్రికెట్ ఆటతో ఎంటర్టైన్ చేసిన చరణ్, సెకండాఫ్ లో కుస్తీ పోటీలతో అసలైన కిక్ ఇచ్చాడని థియేటర్ల దగ్గర పబ్లిక్ టాక్. హీరోయిన్ ట్రాక్ లాంటి చిన్న మైనస్ లు ఉన్నప్పటికీ బోర్ కొట్టకుండా హీరో ఎమోషనల్ జర్నీ ఇంట్రెస్టింగ్ గా సాగిపోతుందని సినిమా చూసిన వాళ్ళు అంటున్నారు. ఫైనల్ గా పెద్ది సినిమా చరణ్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసిందని మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద మొదటి వీకెండ్ ఈ సినిమా కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.
