పెద్ది ఫైనల్ స్టెప్ లో మెగా సెంటిమెంట్
మెగాస్టార్ చిరంజీవి, క్రియేటివ్ మాస్టర్ సుకుమార్ స్వయంగా పెద్ది షూటింగ్ లోకేషన్‌కు వెళ్లి చిత్ర యూనిట్‌ను పలకరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
By: M Prashanth | 8 May 2026 5:03 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా సెట్స్ లో ఒక ఊహించని సర్ ప్రైజ్ విజిట్ జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, క్రియేటివ్ మాస్టర్ సుకుమార్ స్వయంగా పెద్ది షూటింగ్ లోకేషన్‌కు వెళ్లి చిత్ర యూనిట్‌ను పలకరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఎందుకంటే గతంలో సుకుమార్ రంగస్థలం సినిమా షూటింగ్ సమయంలో కూడా మెగాస్టార్ ఇదే తరహాలో సర్ ప్రైజ్ ఇచ్చారు. దీంతో ఆ సినిమాకు కావాల్సినంత బజ్ రావడమే కాదు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు పెద్ది కోసం రావడంతో ఆ సెంటిమెంట్ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. ఈ విజిట్‌కు సంబంధించిన ఒక స్పెషల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. లోకేషన్‌కు చేరుకున్న చిరంజీవిని చూసి రామ్ చరణ్ బుచ్చిబాబు ఎంతో ఎమోషనల్ అయ్యారు. 'చరణ్ చాలా కష్టపడుతున్నాడు సర్' అని దర్శకుడు బుచ్చిబాబు మెగాస్టార్‌కు చెబుతుంటే, చిరంజీవి నవ్వుతూ వారితో కలిసి సరదాగా ముచ్చటించారు. సుకుమార్ కూడా చరణ్ మేకోవర్ ఆ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను చూసి అశ్చర్యపోయారు.
ఈ వీడియోలో చరణ్ పల్లెటూరి కుస్తీ వీరుడి గెటప్‌లో చాలా ఇంటెన్సివ్ గా కనిపిస్తున్నారు. తన తండ్రి సమక్షంలో చరణ్ పడుతున్న కష్టాన్ని చూసి మెగాస్టార్ ఎంతో గర్వంగా ఫీల్ అయ్యారు. వీడియోలో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. బుచ్చిబాబు కూడా తన కండలను చూపించగా చరణ్ అతనవే బాగున్నాయని నవ్వుతూ చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. షూటింగ్ లోకేషన్ లో విజయనగరం నేటివిటీ ఉట్టిపడేలా అవినాష్ కొల్లా వేసిన సెట్స్ ను కూడా చిరంజీవి పరిశీలించారు.
సినిమా షూటింగ్ ఆఖరి షెడ్యూల్ జరుగుతున్న సమయంలో ఇలాంటి పెద్దలు వచ్చి విష్ చేయడం టీమ్ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. చిరంజీవి, సుకుమార్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడమే కాకుండా, సినిమా అవుట్ పుట్ పై వారంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు అర్థమవుతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ స్పీడ్ పెంచారు.
జూన్ 4న థియేటర్లలోకి రాబోతున్న పెద్దికి సంబంధించి జూన్ 3నే ప్రీమియర్ షోలు వేయబోతున్నట్లు లేటెస్ట్ గా ఒక అప్ డేట్ లో వెల్లడించారు. ఇప్పటికే ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు ప్రేక్షకుల్లోకి వెళ్లాయి, త్వరలోనే ట్రైలర్ లాంచ్ కు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ మెగా సర్ ప్రైజ్ విజిట్ తో 'రంగస్థలం' సినిమా తర్వాత చరణ్ నుంచి వస్తున్న మరో పవర్ ఫుల్ విలేజ్ డ్రామా ఎలా ఉండబోతోందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో మరింత పెరిగింది.
ఇక 'పెద్ది' టీమ్ కు మెగాస్టార్ బ్లెస్సింగ్స్ తో పాటు సుకుమార్ సూచనలు కూడా తోడయ్యాయి. జూన్ 4న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. చరణ్ తో పాటు ఈ సినిమాలో జానీ కపూర్, శివరాజ్ కుమార్ వంటి భారీ తారాగణం ఉండటం సినిమా రేంజ్ ను పెంచింది. ఇక కంటెంట్ ఏ స్థాయిలో క్లిక్ అవుతుందో చూడాలి.
