పెద్ది.. రెహమాన్ ముందు అతిపెద్ద టాస్క్
ఇలాంటి టైమ్‌లో, ఒక రీజినల్ డైరెక్టర్, ఒక స్టార్ హీరో కలిసి చేస్తున్న సినిమాను నేషనల్ లెవల్‌కు తీసుకెళ్లాలంటే, దానికి ఒక స్ట్రాంగ్ పుష్ కావాలి.
By: M Prashanth | 4 Nov 2025 8:45 AM IST'RRR' సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు, కానీ ఆ తర్వాత వచ్చిన 'గేమ్ ఛేంజర్' ఆ పాన్ ఇండియా మార్కెట్ ను నిలబెట్టలేకపోయింది. దీంతో, చరణ్ ఇప్పుడు తన ఆశలన్నీ 'పెద్ది' మీదే పెట్టుకున్నాడు. ఈ సినిమాతో సౌత్‌లోనే కాదు, నార్త్‌లో కూడా సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆయన గట్టిగా టార్గెట్ పెట్టుకున్నాడు.
ఇది కేవలం చరణ్ కే కాదు, డైరెక్టర్ బుచ్చిబాబుకు కూడా పెద్ద అగ్నిపరీక్ష. 'ఉప్పెన'తో 100 కోట్లు కొట్టినా, అది తెలుగులో రీజినల్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు 'పెద్ది' ఆయనకు మొదటి పాన్ ఇండియా ఛాలెంజ్. ఇలాంటి టైమ్‌లో, ఒక రీజినల్ డైరెక్టర్, ఒక స్టార్ హీరో కలిసి చేస్తున్న సినిమాను నేషనల్ లెవల్‌కు తీసుకెళ్లాలంటే, దానికి ఒక స్ట్రాంగ్ పుష్ కావాలి.
'పెద్ది' విషయంలో ఆ బాధ్యత మొత్తం ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మీదే పడింది. ఒక సినిమా పాన్ ఇండియా లెవల్‌లో క్లిక్ అవ్వాలంటే, ఇప్పుడు కంటెంట్‌తో పాటు, మ్యూజిక్ కూడా ముందే చార్ట్‌బస్టర్ అవ్వాలి. పుష్ప, యానిమల్ సినిమాలు నార్త్‌లో ఊపేయడానికి ఆల్బమ్స్ ఎంత హెల్ప్ అయ్యాయో చూశాం.
ఇక్కడే అసలు టెన్షన్ మొదలవుతోంది. ఏఆర్ రెహమాన్.. ఈ పేరుకు ఇండియా వైడ్‌గా క్రేజ్ ఉంది, అందులో డౌట్ లేదు. కానీ, సినిమా రిలీజ్‌కు ముందు బజ్ క్రియేట్ చేయడంలో, ఆల్బమ్‌తో ఊపేయడంలో ఆయన పాత హవా ఈ మధ్య కాలంలో కనిపించడం లేదు. ఆయన మ్యూజిక్ సినిమా రిలీజ్ అయ్యాక, కథతో పాటు స్లో పాయిజన్‌లా ఎక్కుతుంది తప్ప, రిలీజ్‌కు ముందే హైప్ తెచ్చే ఆల్బమ్స్ ఈమధ్య రాలేదు.
కానీ 'పెద్ది' లాంటి రస్టిక్ డ్రామాకు, అది కూడా పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్నప్పుడు, కేవలం సినిమా బాగుంటే సరిపోదు. నార్త్ ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించాలంటే, పాటలు ముందుగా వాళ్ల చెవుల్లో మోగాలి. ఈ బాధ్యత ఇప్పుడు పూర్తిగా రెహమాన్ మీదే ఉంది. రీసెంట్‌గా, చరణ్ రెహమాన్ మధ్య నడిచిన "చికిరి చికిరి" ట్వీట్ వార్‌తో మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇది ఫ్యాన్స్‌లో కొత్త ఆశలు రేపింది.
మొత్తానికి, 'పెద్ది' సినిమా బరువులో రామ్ చరణ్, బుచ్చిబాబుల వాటా ఎంత ఉందో, ఏఆర్ రెహమాన్ వాటా కూడా అంతే ఉంది. 'గేమ్ ఛేంజర్' ఫ్లాప్ తర్వాత చరణ్, 'ఉప్పెన' తర్వాత బుచ్చిబాబు ఎలాగైతే ప్రూవ్ చేసుకోవాలనో.. రెహమాన్ కూడా తన పాత మ్యూజికల్ హవా ఇంకా తగ్గలేదని, తన పాటలతోనే పాన్ ఇండియా మార్కెట్‌ను షేక్ చేయగలనని ప్రూవ్ చేసుకోవాల్సిన టైమ్ ఇది.
