హై రేంజ్ లో పెద్ది .. అది రీచ్ అవుతేనే సేఫ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ పెద్దిపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఉప్పెన సినిమా తర్వాత దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తు చిత్రం ఇది.
By: M Prashanth | 11 Sept 2025 11:07 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ పెద్దిపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఉప్పెన సినిమా తర్వాత దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తు చిత్రం ఇది. ఈ సినిమా భారీ రేంజ్ లో తెరకెక్కుతుంది. భారీ అంటే భారీగానే. ఎందుకంటే ఈ సినిమా నెంబర్లు ఈ రేంజ్ లో ఉన్నాయి మరి. గేమ్ ఛేంజర్ అడ్డంకులు దాటుకుని ఈ సినిమా పట్టాలెక్కింది. ఇప్పటికే సుమారు 80 రోజులు షూటింగ్ పూర్తి చేసుకుంది.
అయితే భారీ రెంజ్ లో తెరకెక్కించే ఏ పెద్ద సినిమా అయినా 100 రోజులు షూట్ ఉంటుంది. మరీ అత్యంత భారీ ప్రాజెక్ట్ అయితే ఇంకొన్ని రోజులు ఎక్కువ. అయితే పెద్ది అలాంటి సినిమానే అనుకోవాలి. ఎందుకంటే ఈ చిత్రానికి ఇంకా 70 నుంచి 75 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. సినిమా కథ అంత పెద్దది కావడమే ఇందుకు కారణం. ఈ లెక్కన మొత్తం మీద పెద్ది సినిమా షూటింగ్ 150 రోజులకు పైనే అన్న మాట.
ఈ చిత్రానికి ఖర్చు కూడా భారీనే చేస్తున్నారు. దాదాపు రూ. 300 కోట్లకు పైగానే ఖర్చు అవుతోందని తెలుస్తోంది. హీరోకు రెమ్యూనిరేషన్ కాకుండానే మరో రూ.200 కోట్లు ఖర్చు అవుతుందట. అయితే ఇక్కడ మేకర్స్ కు లక్కీ ఏంటంటే.. ఇంత భారీ సినిమాకు ఆదాయం కూడా భారీగానే సమకూరుతుంది.
ఓటిటి రేట్లు డౌన్ కాకముందే సినిమాను భారీ ధరకు అమ్మేశారు. ఓటిటి హక్కులు రూ. 130 కోట్లకు అమ్ముడుపోయాయి. సినిమా రన్ టైమ్ ను బట్టి మరో రూ. 20 కోట్ల వరకు వచ్చేలా ఒప్పందం ఉంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నందున అడియో రైట్స్ రూ. 20 కోట్లకు పైగా అమ్ముడు పోయాయి.
ఇక తెలుగు థియేటర్ హక్కులు ఎంత లేదన్నా రూ. 120 కోట్ల దాకా ఉంటాయి. ఓవర్సీస్ హక్కులు అన్నీ కలిపి రూ. 40 కోట్ల వరకు వస్తాయని అంచనా వేస్తున్నారు. హిందీ డబ్బింగ్, శాటిలైట్, తెలుగు శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్మాల్సి ఉంది. అయితే ఆ మార్కెట్ మాత్రం ఇప్పుడు అంత గొప్పగా ఏమీ లేదు. ఇలా ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా రూ. 350 కోట్లకు పైగా బిజినెస్ చెయ్యాలి. అప్పుడైతేనే నిర్మాతకు ఏమైనా వర్కౌట్ అవుతుంది.
కాగా, ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సతీశ్ వెంటక కిలారు నిర్మిస్తున్నారు. 2026 మార్చి 26న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
