Begin typing your search above and press return to search.

పెద్ది అడ్వాన్స్ బుకింగ్స్.. మండే టెస్ట్ పాస్ అయినట్లే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

By:  M Prashanth   |   8 Jun 2026 10:20 PM IST
పెద్ది అడ్వాన్స్ బుకింగ్స్.. మండే టెస్ట్ పాస్ అయినట్లే..
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన తొలి రోజు నుంచే భారీ వసూళ్లు సాధిస్తున్న ఆ సినిమా.. తొలి వీకెండ్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.292.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మూవీ టీమ్ అనౌన్స్ చేసింది. దీంతో ఆ సినిమా బాక్సాఫీస్ జర్నీపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.





సాధారణంగా భారీ సినిమాలకు తొలి మూడు రోజులు లేదా తొలి వీకెండ్ కీలకంగా ఉంటాయి. అయితే అసలు పరీక్ష మాత్రం సోమవారం నుంచి స్టార్ట్ అవుతుందని అంతా చెబుతుంటారు. సెలవులు, వీకెండ్ జోష్ ముగిసిన తర్వాత కూడా ప్రేక్షకులు థియేటర్లకు వస్తేనే సినిమా లాంగ్ సక్సెస్ కు స్ట్రాంగ్ సిగ్నల్ గా భావిస్తారు. ఈ నేపథ్యంలో పెద్దికి సోమవారం వచ్చిన రెస్పాన్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మొదటి రోజు రూ.135 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఆ చిత్రం, ఆ తర్వాత కూడా స్టేబుల్ కలెక్షన్లను నమోదు చేసింది. వీకెండ్ ముగిసే నాటికి దాదాపు రూ.300 కోట్ల మార్క్‌ కు చేరువ కావడం సినిమాపై ఉన్న క్రేజ్‌ ను చూపిస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ నుంచి మంచి రెస్పాన్స్ రావడం కలెక్షన్లకు స్ట్రాంగ్ గా మారినట్లు తెలుస్తోంది.

ఇక సోమవారం కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నట్లు సమాచారం. పలు ప్రాంతాల్లో టికెట్ సేల్స్ ఫుల్ జోష్ లో ఉండటం, ఆన్‌లైన్ బుకింగ్ ట్రెండ్ పాజిటివ్ గా కనిపించడం మూవీ టీమ్ కు ఊరటనిస్తోంది. బుక్ మై షోలో గంటకు 14 వేలకుపైగా టికెట్లు అమ్ముడవుతున్నాయి. దీంతో పెద్ది వీక్‌ డే టెస్ట్ ను కూడా ఫేస్ చేస్తున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఓవర్సీస్ మార్కెట్‌ లో కూడా సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి కంట్రీస్ లో మంచి వసూళ్లు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్‌ కు ఉన్న గ్లోబల్ క్రేజ్, పాన్ ఇండియా స్థాయిలో సినిమాపై ఏర్పడిన హైప్.. ఫారిన్ మార్కెట్‌ లో కలెక్షన్లకు హెల్ప్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే సినిమా అసలు రేంజ్ ఏంటన్నది రాబోయే రోజుల్లో మరింత క్లియర్ గా తెలుస్తోంది.

సోమవారం తర్వాత మంగళవారం, బుధవారం రోజుల్లో కూడా కలెక్షన్లు స్టేబుల్ గా ఉంటే పెద్ది బాక్సాఫీస్ రన్ మరింత స్ట్రాంగ్ గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం కనిపిస్తున్న ట్రెండ్ కొనసాగితే త్వరలోనే రూ.500 కోట్ల క్లబ్ దిశగా సినిమా అడుగులు వేయొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా తొలి వీకెండ్‌ లో దూసుకెళ్లిన పెద్ది, ఇప్పుడు వీక్‌ డేల్లోనూ అదే జోరు కొనసాగించేలా కనిపిస్తోంది. సోమవారం అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఆ చిత్రం మండే టెస్ట్‌ ను కూడా సక్సెస్ ఫుల్ గా పాస్ అయినట్లేనని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు