జాన్వీ, చరణ్.. ఫోకస్ లోకి వచ్చిన రొమాంటిక్ సీన్
రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన 'పెద్ది' సినిమాలో ఒక లిప్ లాక్ సీన్ ఉందనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో బాగా నానుతోంది.
By: M Prashanth | 3 Jun 2026 5:12 PM ISTరామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన 'పెద్ది' సినిమాలో ఒక లిప్ లాక్ సీన్ ఉందనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో బాగా నానుతోంది. ఈ సన్నివేశం గురించి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఒక ఇంటర్వ్యూలో హింట్ ఇవ్వడంతో విషయం ట్రేండింగ్ లోకి వచ్చేసింది. చరణ్ ఈ ముద్దు సీన్ లో చాలా బాగా నటించాడని రెహమాన్ ఓపెన్ గా చెప్పడం విశేషం. ఒక స్టార్ కంపోజర్ రేంజ్ వ్యక్తి సినిమాలోని ఇలాంటి ఒక రొమాంటిక్ సీన్ గురించి మాట్లాడటంతో, అసలు స్క్రీన్ పై ఆ ఎమోషన్ ఏ రేంజ్ లో ఉండబోతోందో అని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు.
గతంలో వచ్చిన 'రంగస్థలం' సినిమాలో కూడా రామ్ చరణ్ ఒక కిస్ సీన్ లో కనిపించాడు. అయితే ఆ సన్నివేశంలో సమంతే చరణ్ కు ముద్దు పెడుతుంది, చిట్టిబాబు పాత్ర కేవలం అలా ఉండిపోతుంది. అప్పట్లో కాస్త మొహమాట పడుతూ కనిపించిన చరణ్, ఇప్పుడు జాన్వీ కపూర్ తో ఎలాంటి సీన్ చేశాడనేది ఆసక్తికరంగా మారింది. పాత సినిమా తరహాలోనే ఇది కూడా ఒక నార్మల్ సీన్ లా ఉంటుందా లేక కథలో భాగంగా అంతకుమించి ఇంటెన్స్ గా డిజైన్ చేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బుచ్చిబాబు మేకింగ్ ను బట్టి చూస్తే కేవలం గ్లామర్ కోసమే కాకుండా స్టోరీ డిమాండ్ బట్టే ఈ సీన్ వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. దర్శకుడు బుచ్చిబాబు సనా ఈ సినిమాను ఒక పక్కా రూరల్ డ్రామాగా తెరకెక్కించాడు. కథలోని ఇంటెన్సిటీని పెంచేందుకే ఈ సీన్ పెట్టారని చిత్ర బృందం అంటోంది. చరణ్ తన పాత్రలో పూర్తిగా లీనమైపోయాడని, క్యారెక్టర్ డిమాండ్ చేసిన ప్రతి ఒక్కటి స్క్రీన్ పై పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశాడని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు.
నటుడిగా తనను తాను మార్చుకుంటూ చరణ్ చేసిన ఈ ప్రయత్నం కచ్చితంగా సినిమాకు హైలైట్ గా మారుతుందని మేకర్స్ నమ్ముతున్నారు. హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ ప్రాజెక్ట్ ను నార్త్ తో పాటు సౌత్ లో కూడా గట్టిగా ప్రమోట్ చేసింది. ఇలాంటి సున్నితమైన సన్నివేశాలు ఉన్నప్పుడు కొందరు అభిమానులు నెగిటివ్ గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. నేటి తరం ప్రేక్షకులు సినిమాను చూసే విధానం మారింది కాబట్టి, కథలో ఆ సీన్ కు సరైన జస్టిఫికేషన్ ఉంటే కచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు.
కేవలం కమర్షియల్ హంగుల కోసం కాకుండా సీన్ లోని డెప్త్ ని బట్టి జనాల రెస్పాన్స్ ఆధారపడి ఉంటుంది. మరో కొన్ని గంటల్లో సినిమా థియేటర్లలోకి రాబోతుండటంతో ఈ కిస్సింగ్ సీన్ వెనుక ఉన్న అసలు నిజం ఏంటనేది తేలిపోనుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రంలో చరణ్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ఏఆర్ రెహమాన్ అందించిన సాంగ్స్ ఆల్రెడీ హిట్టయ్యాయి. గ్లామర్ తో పాటు బలమైన కంటెంట్ ఉన్న ఈ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
