రిలీజ్ కు ముందే జపాన్ లో 'పెద్ది' బ్లాస్ట్!
ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు జపాన్ లో ఏ రేంజ్లో ఫాలోయింగ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 23 Nov 2025 1:00 AM ISTప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు జపాన్ లో ఏ రేంజ్లో ఫాలోయింగ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఈ నయా స్టార్లు ఎక్కడికి వెళ్లినా జపాన్ అభిమానులు వెంటాడుతున్నారు. పుట్టిన రోజులు వచ్చాయంటే? స్వదేశం వదిలి హైదరాబాద్ లో వాలిపోతున్నారు. ఇంటిముందు కొచ్చి కేక్ కట్ చేసి మరీ విషెస్ తెలియజేస్తున్నారు. అభిమా నులంటే ఆ స్టార్లు సైతం అంతే ప్రాణం పెడతారు. అందుకే ప్రభాస్ `కల్కి 2` సక్సెస్ లో భాగంగా చెప్పాల్సిన కృతజ్ఞతను చెప్పడానికి ఇప్పుడు ప్రత్యేకంగా జపాన్ బయల్దేరుతున్నాడు. వచ్చే వారం ప్రభాస్ జపాన్ ప్రయాణం ఉంటుంది.
డార్లింగ్ తర్వాత రామ్ చరణ్:
అంతకు ముందు ఎన్టీఆర్ కూడా జపాన్ అభిమానుల్ని ఉద్దేశించి చేసిన వీడియోలు...పోస్ట్ చేసిన ఫోటోలు ఎంత సంచలనమయ్యాయో తెలిసిందే. `దేవర` ప్రచారంలో భాగంగా తారక్ కూడా జపాన్ వెళ్లొచ్చాడు. ఈ నేపథ్యంలో తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `పెద్ది` రిలీజ్ కు ముందు జపాన్ లో బ్లాస్ట్ అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక ఈవెంట్ జపాన్ లో కూడా చేయాలనుకుంటున్నారుట. దీనిలో భాగంగా రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు తో పాటు సంగీత సంచనలం రెహమాన్ కూడా జపాన్ వెళ్లాలనుకుంటున్నారుట. అక్కడ అభిమానుల్ని దృష్టిలో పెట్టుకునే ముందొస్తు ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్స్ నడుస్తున్నాయి.
అక్కడా ఈవెంట్ తప్పని సరా?
ప్రస్తుతం `పెద్ది` షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. చాలా భాగం చిత్రీకరణ పూర్తయింది. ఇప్పటికే తొలి లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఈ పాటను రెహమన్ మ్యూజికల్ నైట్ లో హైలైట్ చేసారు. అదే ఈవెంట్ లో రామ్ చరణ్, బుచ్చిబాబు కూడా పాల్గొన్నారు. చరణ్ పాల్గొనడం రెహమాన్ ఈవెంట్ కు ఎంతగానో కలిసొచ్చింది. `పెద్ది`కి పెద్ద ఎత్తున ప్రచారం కూడా దక్కింది. చరణ్ గ్లోబల్ ఇమేజ్ నేపథ్యంలో `పెద్ది` కూడా జపాన్ లో కూడా తప్పక రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే అక్కడ కూడా టీజర్...ట్రైలర్ లాంటి ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
అక్కడ కూడా ముందుగానే?
ముందుగానే ఇలాంటి వాటితో జపాన్ ఆడియన్స్ లో కి వెళ్తే రిలీజ్ సమయం వచ్చే సరికి అది సినిమాకు మరింత కలిసొస్తుందని మేకర్స్ ప్లాన్ కావొచ్చు. సాధారణంగా పాన్ ఇండియాలో రిలీజ్ అనంతరం కొంత సమయం తీసుకురని జపాన్ లో రిలీజ్ లు ప్లాన్ చేస్తుంటారు. కానీ జపాన్ లో అభిమానుల ఉత్సాహం చూసి అక్కడ కూడా పాన్ ఇండియాతో పాటు, సైమల్టేనియస్ గా రిలీజ్ ప్లాన్ చేసే అవకాశం లేకపోలేదు.
