Begin typing your search above and press return to search.

జానీ మ‌రో చికిరిని ఇస్తాడా?

చికిరి సాంగ్ ను రెహ‌మాన్ కంపోజ్ చేసిన విధానంతో పాటూ ఆ సాంగ్ లో చ‌ర‌ణ్ వేసిన డ్యాన్సులు సాంగ్ కు భారీ వ్యూస్ ను తెచ్చిపెట్టాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   17 Nov 2025 10:35 AM IST
జానీ మ‌రో చికిరిని ఇస్తాడా?
X

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా తెర‌కెక్కుతున్న సినిమా పెద్ది. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుంది. ఉప్పెన మూవీతో టాలీవుడ్ లోకి డైరెక్ట‌ర్ గా అడుగుపెట్టి మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న బుచ్చిబాబు సాన ఈ భారీ బ‌డ్జెట్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

రెహ‌మాన్ ను ఒప్పించి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన బుచ్చిబాబు

రెండో సినిమా ఎలాగైనా భారీగానే తీయాల‌నే ఉద్దేశంతో ఎంతో కాలం పాటూ వెయిట్ చేసి రామ్ చ‌ర‌ణ్ తో పెద్ది సినిమాను అనౌన్స్ చేయ‌డ‌మే కాకుండా ఈ సినిమాకు ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ తో మ్యూజిక్ చేయించుకోవ‌డానికి ఒప్పించుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు బుచ్చిబాబు. పెద్ది సినిమా క‌థ త‌న‌నెంతో ఎగ్జైట్ చేసింద‌ని రెహ‌మాన్ కూడా ప‌లుమార్లు చెప్పిన సంగ‌తి తెలిసిందే.

చికిరి సాంగ్ కు భారీ రెస్పాన్స్

అందుకే పెద్ది మూవీని రెహ‌మాన్ కూడా స్పెష‌ల్ గా తీసుకుని ఎప్పుడూ లేనిది సినిమా షూటింగ్ మొద‌ల‌వ‌క ముందే నాలుగు ట్యూన్ల‌ను కూడా కంపోజ్ చేసి ఇచ్చార‌ని వార్త‌లొచ్చాయి. రీసెంట్ గా పెద్ది సినిమా నుంచి చికిరి చికిరి అనే ఫ‌స్ట్ సాంగ్ రిలీజ‌వ‌గా, ఆ సాంగ్ కు ఆడియ‌న్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. చికిరి సాంగ్ ను రెహ‌మాన్ కంపోజ్ చేసిన విధానంతో పాటూ ఆ సాంగ్ లో చ‌ర‌ణ్ వేసిన డ్యాన్సులు సాంగ్ కు భారీ వ్యూస్ ను తెచ్చిపెట్టాయి.

ఆ సాంగ్ ను కొరియోగ్ర‌ఫీ చేసింది జానీ మాస్ట‌ర్. ఇప్ప‌టికే చ‌రణ్ తో క‌లిసి జానీ మాస్ట‌ర్ ప‌లు పాట‌ల‌కు కొరియోగ్రాఫ‌ర్ గా వ‌ర్క్ చేశారు. పెద్దిలో చికిరి సాంగ్ కు కొరియోగ్ర‌ఫీ చేసి ఆ సాంగ్ ను మంచి హిట్ చేసిన జానీ, ఇప్పుడు పెద్ది లో మ‌రో సాంగ్ కు కూడా కొరియోగ్ర‌ఫీ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. పెద్ది టీమ్ గ‌త కొన్నాళ్లుగా ఓ సాంగ్ షూట్ లో బిజీగా ఉండ‌గా, ఆదివారంతో ఆ సాంగ్ షూటింగ్ స‌క్సెస్‌ఫుల్ గా పూర్తైన‌ట్టు తెలుస్తోంది. జానీ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో చేసిన ఈ సాంగ్ మొత్తం హైద‌రాబాద్ శివార్ల‌లోనే తెర‌కెక్కించార‌ని స‌మాచారం. ఆల్రెడీ చికిరి సాంగ్ లో చ‌ర‌ణ్ తో సూప‌ర్బ్ మూమెంట్స్ చేయించిన జానీ, ఈ సాంగ్ లో చ‌ర‌ణ్ తో ఎలాంటి స్టెప్పులేయించారో చూడ్డానికి అంద‌రూ ఆతృత‌గా ఉన్నారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది మార్చి 27న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్టు మేక‌ర్స్ ఇప్ప‌టికే అనౌన్స్ చేశారు.