జాన్వీ అందాల విందుకు శ్రుతి బోనస్ ట్రీట్: మెగాఫ్యాన్స్‌కు ముందుంది ముసళ్ల పండగ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న `పెద్ది` సినిమా ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్.
By: Sivaji Kontham | 29 April 2026 9:21 AM ISTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న `పెద్ది` సినిమా ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్. ఈ చిత్రం 25 జూన్ 2026న విడుదల కానున్నట్లు ప్రకటించడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే పెద్ద తెరపై కేవలం చరణ్ యాక్షన్ ట్రీట్ మాత్రమే కాదు... గ్లామర్ పరంగా కూడా భారీ పోటీ ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ గా మారనుంది. ఇందులో చరణ్ ప్రధాన హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్ ఇప్పటికే తన గ్లామర్‌తో కుర్రకారును ఊపేస్తుంటే.. ఇప్పుడు తనకు పోటీగా స్పెషల్ సాంగ్‌లో శ్రుతిహాసన్ ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ గ్లామర్ ఎలివేషన్ పీక్స్‌లో ఉంటుందని ఇప్పటికే విడుదలైన పాటలు పోస్టర్లు చెబుతున్నాయి. ఒకవైపు గ్రామీణ వాతావరణం.. మరోవైపు జాన్వీ అందచందాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అయితే కేవలం జాన్వీతోనే సరిపెట్టకుండా మెగా ఫ్యాన్స్‌కు `బోనస్ ట్రీట్` ఇవ్వాలని దర్శకుడు ప్లాన్ చేశారు. దీని కోసం ఏకంగా 3.3 కోట్ల భారీ రెమ్యూనరేషన్‌తో శ్రుతిహాసన్‌ను రంగంలోకి దించారు. హైదరాబాద్ శివార్లలో శ్రుతిపై ప్రస్తుతం ప్రత్యేక గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రత్యేక గీతం షూటింగ్ మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది.
ఈ స్పెషల్ సాంగ్ కోసం ఏఆర్ రెహమాన్ మాంచి మాస్ మసాలా బాణీని అందించినట్లు లీకులు అందుతున్నాయి. గతంలో రవితేజ నటించిన `బలుపు` సినిమాలో శ్రుతిహాసన్ తనదైన గ్లామర్ - ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో హృదయాల్ని గెలుచుకుంది. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో రామ్ చరణ్‌తో కలిసి స్టెప్పులు వేయబోతోంది. జాన్వీ లాంటి గ్లామర్ డాళ్ సినిమాలో ఉన్నప్పుడు శ్రుతిహాసన్ తన స్పెషల్ సాంగ్‌లో అంతకుమించి అందాల విందు వడ్డించాల్సి ఉంటుంది. అందుకే ఈ ఇద్దరు భామల మధ్య గ్లామర్ యుద్ధం మెగా అభిమానులకు కన్నుల పండుగగా మారబోతోంది.
ప్రస్తుతం శ్రుతిహాసన్ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉంది. ప్రభాస్ `సలార్ 2`లో శ్రుతి నటించాల్సి ఉంది. ఇంతలోనే `పెద్ది`లోని ఈ స్పెషల్ సాంగ్ కోసం ఈ బ్యూటీ ప్రాధాన్యతను ఇవ్వడం విశేషం. మిస్కిన్ దర్శకత్వంలో రూపొందుతున్న ట్రైన్ అనే తమిళ చిత్రంలోను శ్రుతి నటిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇదొక ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ అని సమాచారం. అలాగే `ఆకాశంలో ఒక తార` అనే తెలుగు చిత్రంలోను శ్రుతి నటిస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
