పెద్దిలో రామ్ చరణ్ కష్టం.. జగ్గూభాయ్ చెప్పిన సీక్రెట్స్
ఇక లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు, చరణ్ వ్యక్తిత్వం గురించి అలాగే నటన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
By: M Prashanth | 27 May 2026 4:35 PM ISTరామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాపై ఇండస్ట్రీలో మంచి బజ్ నడుస్తోంది. సినిమా విడుదలకు సిద్ధమవుతుండడంతో మేకర్స్ కూడా గ్యాప్ లేకుండా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు, చరణ్ వ్యక్తిత్వం గురించి అలాగే నటన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
సెట్స్ లో చరణ్ వర్కింగ్ స్టైల్ ను దగ్గరుండి చూసిన జగపతిబాబు మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చరణ్ గురించి ఎవరైనా మాట్లాడితే తనకు బేసిక్ గానే చాలా ఇష్టం అని జగపతిబాబు చెప్పారు. దానికి ప్రధాన కారణం చరణ్ లో ఉండే సింప్లిసిటీ అని స్పష్టం చేశారు. ఒక పెద్ద స్టార్ డమ్ ఉన్నప్పటికీ అందరితో చాలా క్యాజువల్ గా, చక్కగా తెలుగులో మాట్లాడే విధానం తనకు బాగా నచ్చుతుందని జగపతిబాబు వెల్లడించారు. వ్యక్తిగతంగా చరణ్ చాలా మంచి మనిషి అని సర్టిఫికెట్ ఇచ్చారు.
షూటింగ్ సెట్స్ లో చరణ్ పడే కష్టం గురించి జగపతిబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. పెద్ది సినిమా చిత్రీకరణ సమయంలో చరణ్ హార్డ్ వర్క్ ను తాను స్వయంగా చూశానని చెప్పారు. ఆ కష్టం చూసి పాపం చరణ్ ఇంతలా శ్రమిస్తున్నాడు కదా అని తనకు అనిపించేదని గుర్తుచేసుకున్నారు. పబ్లిక్ లో ఉన్నప్పుడు ఎంత సైలెంట్ గా ఉంటాడో, పని విషయంలో మాత్రం అంతే డెడికేషన్ చూపిస్తాడని అన్నారు.
పెద్ది సినిమాకు సంబంధించి చరణ్ చెప్పే డైలాగ్స్ డెలివరీలో కూడా ఒక రకమైన డెప్త్ ఉంటుందని జగపతిబాబు తెలిపారు. సీన్ కు తగ్గట్టుగా క్యారెక్టర్ లోకి వెళ్లడం కోసం చరణ్ తీసుకునే కేర్ చాలా గొప్పగా ఉంటుందని చెప్పారు. ప్రతి చిన్న విషయంలోనూ పర్ఫెక్షన్ కోసం చరణ్ పడే తపన తనను ఆశ్చర్యపరిచిందని జగపతిబాబు పేర్కొన్నారు. ఒక నటుడిగా చరణ్ ఎదుగుదల గురించి చెబుతూ జగపతిబాబు ఒక మంచి పాయింట్ లాగారు.
గతంలో వచ్చిన రంగస్థలం సినిమా దగ్గరి నుంచి ఇప్పుడు చేస్తున్న పెద్ది సినిమా వరకు చూసుకుంటే, చరణ్ పెర్ఫార్మెన్స్ లో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. ప్రతి సినిమాకూ యాక్టింగ్ లో స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ తనకంటూ ఒక స్ట్రాంగ్ బేస్ క్రియేట్ చేసుకుంటున్నాడని చెప్పారు. నటనలో చరణ్ చూపిస్తున్న ఈ కాన్ఫిడెన్స్ చూస్తుంటే పెద్ది సినిమాలో క్యారెక్టర్ చాలా బాగా వర్కవుట్ అయినట్లు తెలుస్తోంది. సినిమా కంటెంట్ తో పాటు చరణ్ డెడికేషన్ ఈ ప్రాజెక్ట్ కు మెయిన్ హైలైట్ కాబోతోందని ఈ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక సీనియర్ నటుడు సెట్స్ లో గమనించి చెప్పిన ఈ విషయాలు ఇప్పుడు సాధారణ ప్రేక్షకుల్లో కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.
