Begin typing your search above and press return to search.

పెద్ది ఇంట్రడక్షన్ సాంగ్.. విజువల్ ఫీస్ట్ పక్కా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న ‘పెద్ది’ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో అంచనాలు పెంచేసింది.

By:  M Prashanth   |   27 Aug 2025 6:20 PM IST
పెద్ది ఇంట్రడక్షన్ సాంగ్.. విజువల్ ఫీస్ట్ పక్కా
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న ‘పెద్ది’ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో అంచనాలు పెంచేసింది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా మాస్, ఎమోషన్, విజువల్ గ్రాండియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ ఇప్పటికే గ్లోబల్ ట్రెండ్స్‌లోకి వెళ్లి సోషల్ మీడియాలో దుమ్మురేపాయి.


ఇక మేకర్స్ ఒక మాసివ్ ఇంట్రడక్షన్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారు. మైసూర్‌లో 1000 మంది డ్యాన్సర్లతో భారీ స్కేల్‌లో ఈ పాట చిత్రీకరిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ మాస్ నెంబర్ రామ్ చరణ్ కోసం స్పెషల్‌గా రెడీ అయ్యింది. తెలుగు నేటివిటీ, మాస్ సెలబ్రేషన్ అన్నీ కలిపి ఉండేలా బుచ్చిబాబు ఈ సాంగ్‌ను అల్టిమేట్ విజువల్ ఫీస్ట్‌గా ప్లాన్ చేశారని మేకర్స్ చెబుతున్నారు.

జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ కానుంది. రామ్ చరణ్ తన ఎనర్జీతో వేసే మాస్ స్టెప్పులు క్లిక్కయితే థియేటర్స్‌ విజిల్స్‌తో నిండిపోవడం ఖాయం అని చెప్పవచ్చు. ఈ ఇంట్రడక్షన్ సాంగ్ రామ్ చరణ్ క్యారెక్టర్ ఆర్క్‌ను ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా, సినిమాలోని టోన్‌ను సెట్ చేసేలా ఉంటుందట. సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇప్పటికే వారి లుక్స్, ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీపై కూడా అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ మాసివ్ స్పోర్ట్స్ డ్రామా కేవలం యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాకుండా, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లోని ఎమోషన్లను కూడా హైలైట్ చేస్తుందని సమాచారం. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లోనే కాకుండా, గ్లోబల్ లెవెల్‌లో విజువల్ స్పెక్టకిల్‌గా నిలుస్తుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

2026 మార్చి 27న ఈ చిత్రాన్ని థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. మొత్తానికి, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, జానీ మాస్టర్ డ్యాన్స్, చరణ్ ఎనర్జీ అన్నీ కలిపి ఈ ఇంట్రడక్షన్ సాంగ్ సినిమాకు హైలైట్‌గా మారనుంది. ‘పెద్ది’ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరో బిగ్ హిట్ గా నిలవబోతుందని అభిమానులు నమ్ముతున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద సినిమా ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి.