చరణ్ 'పెద్ది'.. ప్రీమియర్స్ తోనే ఆ ఫీట్ అందుకుంటుందా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది రిలీజ్ కు ముందే ఓవర్సీస్ మార్కెట్ లో సాలిడ్ హైప్ ను క్రియేట్ చేస్తోంది.
By: M Prashanth | 28 May 2026 11:05 AM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది రిలీజ్ కు ముందే ఓవర్సీస్ మార్కెట్ లో సాలిడ్ హైప్ ను క్రియేట్ చేస్తోంది. యువ దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్ లో పెద్దికి వస్తున్న రెస్పాన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా విడుదలైన బుకింగ్ అప్డేట్ ప్రకారం.. నార్త్ అమెరికాలో పెద్ది ప్రీమియర్ షోల అడ్వాన్స్ సేల్స్ ఇప్పటికే హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్ ను దాటినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంటే దాదాపు 575K డాలర్లకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి. అంతేకాదు.. ఇప్పటికే 20 వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్టు డిస్ట్రిబ్యూషన్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజులు ఉండగానే ఆ రేంజ్ లో బుకింగ్స్ జరగడం విశేషమే.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కంటిన్యూ అయితే పెద్ది కేవలం ప్రీమియర్ షోల ద్వారానే వన్ మిలియన్ డాలర్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఓవర్సీస్ లో రామ్ చరణ్ క్రేజ్ భారీగా పెరిగింది. గ్లోబల్ రేంజ్ లో ఆయనకు వచ్చిన గుర్తింపు ఇప్పుడు పెద్ది అడ్వాన్స్ బుకింగ్స్ లో క్లియర్ గా కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శివరాజ్ కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ క్యాస్టింగ్ కూడా సినిమాపై అంచనాలు పెరగడానికి మరో కారణంగా మారింది. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు ఇప్పటికే మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
ముఖ్యంగా శృతి హాసన్ స్పెషల్ అప్పియరెన్స్ తో వచ్చిన హాల్లల్లాల్లో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మాస్ ఆడియన్స్‌లో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఆ సినిమా కావడంతో కథ, ఎమోషన్స్ పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ కొత్త మాస్ లుక్, విలేజ్ బ్యాక్ డ్రాప్, స్పోర్ట్స్ టచ్ తో వస్తున్న ఆ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.
వృద్ధి సినిమాస్ తో పాటు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఆ భారీ బడ్జెట్ చిత్రం జూన్ 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కానుంది. ఓవర్సీస్ లో సినిమాను ప్రత్యంగిరా సినిమాస్ రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే బుకింగ్స్ పరంగా దూసుకుపోతున్న పెద్ది మూవీ.. విడుదల తర్వాత కూడా అదే స్పీడ్ ను కొనసాగిస్తుందా? ప్రీమియర్స్ తోనే మిలియన్ డాలర్ ఫీట్ ను అందుకుంటుందా? అన్నది అంతా వేచి చూడాలి.
