సపోర్ట్ బేస్ తోనే చరణ్.. కష్టానికి తగ్గ రిజల్ట్ అందుకుంటారా?
జూన్ 4న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ చిత్రం కోసం ఫిజికల్ గా చరణ్ ఎదుర్కొన్న ఇబ్బందులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
By: M Prashanth | 30 May 2026 12:12 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన భారీ స్పోర్ట్స్ డ్రామా పెద్ది గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న వేళ, సినిమా కంటే ఎక్కువగా ఆయన డెడికేషన్ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. జూన్ 4న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ చిత్రం కోసం ఫిజికల్ గా చరణ్ ఎదుర్కొన్న ఇబ్బందులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
పెద్ది షూటింగ్ సమయంలో రామ్ చరణ్ కంటికి, చేతికి గాయాలు అయిన విషయం ఇప్పటికే తెలిసిందే. కంటికి చిన్న ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకోకుండా మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రమోషన్స్ లో కూడా ఆయన చేతికి సపోర్ట్ బేస్ తో కనిపిస్తుండటంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గాయం గురించి మాట్లాడిన చరణ్.. యాక్షన్ సీన్ చిత్రీకరణ సమయంలో గట్టిగా కింద పడటంతో మణికట్టు భాగంలో కార్టిలేజ్ దెబ్బతిన్నట్లు వెల్లడించారు. సినిమా విడుదలైన తర్వాత దానికి సంబంధించిన సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అయినప్పటికీ సినిమా పనులు పూర్తయ్యే వరకు ఆ చికిత్స వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ఆ విషయంపై చిత్ర నిర్మాత వెంకట సతీష్ కిలారు కూడా స్పందించారు. పెద్దిలో క్రికెట్, కుస్తీ, రన్నింగ్ వంటి స్పోర్ట్స్ ఎలిమెంట్స్ కీలక పాత్ర పోషిస్తాయని, ముఖ్యంగా కుస్తీ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో చరణ్ గాయపడినట్లు తెలిపారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఆ చిత్రం కోసం నటీనటులు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారని సమాచారం.
దర్శకుడు బుచ్చిబాబు సానా అయితే చరణ్ కమిట్మెంట్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు. గాయాల కారణంగా షూటింగ్ కు ఆటంకం కలిగినా ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదని చెప్పారు. సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేశారని, ముఖ్యంగా కుస్తీ నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. తెలుగు తెరపై ఇప్పటివరకు చూడని స్థాయిలో ఆ సన్నివేశాలు తెరకెక్కించినట్లు ఆయన వెల్లడించారు.
నేషనల్ వైడ్ గా కుస్తీ పోటీల నేపథ్యంలో సాగే కొన్ని కీలక ఘట్టాలు చిత్రానికి మెయిన్ అట్రాక్షన్ గా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది. అందుకే ఆ ఎపిసోడ్లు కోసం చరణ్ ప్రత్యేకంగా ఫిజికల్ గా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆ యాక్షన్ సన్నివేశాలు వల్ల ఆయనకు గాయాలయ్యాయి. దీంతో సినిమా కోసం ఎన్నో ఇబ్బందులు చరణ్ పడ్డారని, ఇప్పుడు కష్టానికి తగ్గ రిజల్ట్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇక సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఆ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఏదేమైనా పెద్ది కేవలం మరో సినిమా మాత్రమే కాదు, రామ్ చరణ్ డెడికేషన్ కు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గాయాల మధ్య షూటింగ్ చేయడం, బేస్ తో ప్రమోషన్స్ పూర్తి చేస్తున్న ఆయన హార్డ్ వర్క్ కు తగ్గ రిజల్ట్ అందుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.
